Movies

45 ఏళ్లుగా నాకు ఉదయాన్నే తాగే అలవాటు… శోభన్ బాబు గురించి బయట పడ్డ నమ్మలేని నిజం

అప్పటి కదనాయకులలో మన్మధుడు, అందగాడు అంటే గుర్తొచ్చే నటుడు శోభన్‌బాబు. తన నటనతో వివిధమైన పాత్రలు చేసి అందరిని మేంపించాడు. సినిమాల నుంచి స్వచ్ఛందంగా విరామం తీసుకున్న తొలి నటుడు కూడా ఆయనే. అప్పటి హీరోలు ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. శోభన్ బాబు వీరికంటే ముందుండేవాడు. ఆయనకి మద్యపానము కానీ ధూమపానం కానీ అలవాటు లేదు. సినిమాలలో మాత్రం పాత్ర కోసం త్రాగేవారు. ఆయనకి కాపీ త్రాగే అలవాటే తప్ప మరే అలవాటు లేదు. తరువాత అయన కాపీ త్రాగడం కూడా మానేసాడు.

శోభన్ బాబు ఏదైనా పార్టీకి వెళ్లిన త్రాగేవాడు కాదు. ఆల్కహాల్‌ శాతం తక్కువ ఉండే షాంపైన్‌ను కూడా తాగలేదు. పార్టీకి వచ్చే హీరోయిన్లు కూడా షాంపైన్‌ తాగుతూ నన్ను త్రాగమని బలవంత పెట్టేవాళ్లు. తాను కనీసం ముట్టుకోలేదు. నేను అలాగే పెరిగాను నా జీవనశైలి అలాగే ఉంటుందని చెప్పేవాడు. కానీ నాకు 45ఏళ్ల నుంచి ఉదయాన్నే కాఫీ తాగడం అలవాటు. అది కూడా మానేశా అని చెప్పారు.

దీనికి కారణం ఏవండీ ఆవిడ వచ్చింది చిత్రం షూటింగ్‌ జరుగుతుండగా, ఉదయాన్నే కాఫీ అడిగాను. కానీ, ఎవరూ తెచ్చి ఇవ్వలేదు. షూటింగ్‌కు వెళ్లిపోయాను. రెండో రోజూ అదే పరిస్థితి. తాను రెండు రోజులు కాఫీ తాగకుండా ఉండగలిగాను కదా.

అసలు పూర్తిగా మానేస్తే ఏమవుతుంది’ అని అనుకుని అప్పటి నుంచి కాఫీ కూడా తాగడం మానేసాను అని అన్నారు. ఒకసారి విమానంలో వెళుతున్నప్పుడు ఎయిర్‌హోస్టస్‌ కాఫీ తీసుకొచ్చింది కానీ దాని వాసనా పీల్చి అక్కడ పెట్టేశా అని చెప్పుకొచ్చారు శోభన్‌బాబు.