Movies

న్యూ బిజినెస్ లో దూసుకెళ్తున్న యాంకర్…భర్త పరిస్థితి ఏమిటో చూడండి

బుల్లితెర పై పలు చానల్స్ రావడంతో యాంకర్స్ కి ఛాన్స్ లు పెరిగాయి. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వస్తున్నారు. అయితే ఆ మధ్య తెలుగు బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంక‌ర్ లాస్య‌ కి మంచి క్రేజ్ ఉంది. యాంకర్ ర‌వితో కల్సి చేసిన యాంకరింగ్ అదిరిపోయేది. అయితే అతడితో విడిపోయి ఆత‌ర్వాత‌.. ఆమె స‌ప‌రేట్‌గా ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత రెండేళ్ళ క్రితం మంజునాధ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది.

నిజానికి పెళ్లికి ముందు లాస్యపై బోలెడ‌న్ని రూమ‌ర్లు వ‌చ్చాయి. ఆ మ‌ధ్య సూసైడ్ అటెంప్ట్ చేసింద‌ని ఓ సారి.. ర‌వితో పెళ్లైపోయింద‌ని మ‌రోసారి.. ఇలా బోలెడ‌న్ని రూమ‌ర్లు వైరల్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో వాటన్నింటికి సమాధానం ఇచ్చింది. పెళ్లైన త‌ర్వాత అన్నీ మానేసి భర్త, బిడ్డతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తున్న లాస్య ప్రస్తుతం స్క్రీన్ ‌పై కనిపించడం పూర్తిగా మానేసింది. పైగా బాగా లావు కూడా అయిపోవడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

ఇక ఈ మధ్యే కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. పైగా భర్త అండదండలు కూడా ఉండటంతో ఈ ముద్దుగుమ్మ. అందులో బాగానే దుమ్ము దులిపేస్తోంది. సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ పెట్టి, తనకు సంబంధించిన వీడియోలతో పాటు వంట వీడియోలు కూడా పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భర్త మంజుతో కలిసి చికెన్ వండింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దాంతోపాటు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మరో వీడియో కూడా పోస్ట్ చేసింది. భర్తతో కలిసి కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ బాగానే సక్సెస్ కొట్టేస్తోంది.