Movies

సినిమా తారలను మించి ఈ నలుగురు బుల్లితెరను దున్నేస్తున్నారు

సీరియల్స్ మనవాళ్ళ జీవితాలను పాడుచేస్తున్నాయని ఎంతగా గోల చేసినా, గగ్గోలు పెడుతున్నా, మరో ఎంటర్ టైన్ మెంట్ లేని కారణంగా ఇంట్లో బుల్లితెరపై వచ్చే సీరియల్స్ కి మనవాళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు, కోట్లు కుమ్మరించి తీసే సినిమాల కోసం థియేటర్ కి వెళ్తే, సినిమా బాగుంటుందో లేదో అనే అనుమానం. పైగా టికెట్ ధరలూ ఎక్కువే. అందుకే ఎంచక్కా ఇంట్లో కూర్చుని సీరియల్స్ ని తిట్టుకుంటూనే చూసేస్తున్నారు. సీనిమాల్లో మాదిరిగా టీవీల్లో కూడా ఇతర భాషల నటులే హవా సాగిస్తున్నారు. తెలుగు నటులు టీవీల్లో కూడా కరువయ్యారు.

దాదాపు 687ఎపిసోడ్స్ పైగా అనూహ్య టీఆర్ఫీ రేటింగ్ తో కార్తీక దీపం సీరియల్ దూసుకెళ్తోంది. ఆవిడ నలుపు రంగు,అపార్ధాల మొగుడు ,తన విశ్వాసం కోసం జీవితాంతం ప్రయత్నించే పెళ్ళాం .. ఇలా ఇప్పటికీ ఈ సీరియల్ కొనసాగిపోతోంది. కోట్లకు కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన టాప్ హిట్ మూవీ కి రానంత రేటింగ్ ఈ సీరియల్ కి వస్తోందట. అందుకే ఇప్పటికి కూడా 18.2 టీఆర్ఫీ రేటింగ్ తో నడుస్తోంది. దీనికున్న ఫాలోయింగ్ ప్రస్తుతం ఏ సీరియల్ కి లేదు. ఇక ఈ సీరియల్ లో వేసిన ప్రేమి విశ్వనాధ్ ప్రతి ఇంటికి పరిచయం అని చెప్పాలి. టాప్ హీరోయిన్ కూడా జనానికి అంతగా తెలీదేమో అంతలా ప్రేమి విశ్వనాధ్ కి ఫాలోయింగ్ ఉంది.

మలయాళం,తెలుగు,కన్నడం,మరాఠీ ,తమిళం మొత్తం ఐదు భాషల్లో నడిచే ఈ సీరియల్ కుమ్మేస్తోంది. లాయర్,ఫోటోగ్రాఫర్ అయిన ఈ వంటలెక్కల ప్రేమీ విశ్వనాధ్ మలయాళీ. వినీత్ భట్ అనే జ్యోతిష్యుణ్ణి పెళ్లాడింది. ఇక మౌనరాగం సీరియల్ లో హీరోయిన్ ప్రియాంక జైన్ మూగమ్మాయిగా చేస్తోంది. ఈమె కూడా బెంగళూరు. 9.7 రేటింగ్ తో నడుస్తోంది. కథలో రాజకుమారి సీరియల్ లో నటిస్తున్న ఆశికా గోపాల్ కూడా కన్నడ ఆర్టిస్ట్. వదినమ్మ సీరియల్లో నటిస్తున్న సుజిత కూడా మలయాళీ. ఇది 11.6 దాకా రేటింగ్ నడుస్తోంది. ఇక 11.4 రేటింగ్ తో దూసుకెళ్తున్న గోరింటాకు సీరియల్ లో కీలక రోల్ పోషించే కావ్యాది బెంగళూరు.