Kitchen

New Year – అరటిపండు కేక్‌

రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా? అయితే ఖచ్చితంగా ఇది మీ కోసమే. అదిరిపోయే అరటిపండు కేక్‌ ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి.

కావాల్సిన పదార్ధాలు

మైదా- 150 గ్రా,
వెన్న- 150 గ్రా,
చక్కెర- 150 గ్రా,
కోడిగుడ్లు- ఆరు,
బేకింగ్‌ సోడా- పావు టీ స్పూను,
ఉప్పు- చిటికెడు,
అరటిపండ్లు- ఆరు,
బనానా ఫ్లేవర్‌- కొద్దిగా,
బాదం, జీడిపప్పు- రుచికి తగినన్ని.

తయారు చేయు విధానం
అరటిపండ్లని చిదిమి గుజ్జులా చేసుకోవాలి. కోడిగుడ్లు బాగా గిలక్కొట్టి పదార్థాలన్నిటినీ బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో చిన్న మంటమీద ఆరు విజిల్స్‌ వచ్చేదాకా ఉంచాలి.