Movies

2019 లో రామ్ చరణ్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి లుక్ వేయండి

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో చరణ్‌ ‘వినయ విధేయ రామ’ ఒకటి. బోయపాటి శీను దర్శకత్వంలో మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆశించిన రిజల్ట్‌ అందుకోకపోగా, హీరోగా చరణ్‌ కెరీర్‌లో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాకి చరణ్‌ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ రకంగా నిర్మాతగా, హీరోగా రెండు సినిమాలు ఈ ఇయర్‌ చరణ్‌ నుండి వచ్చాయి. కానీ రిజల్ట్‌ విషయంలో ఆశలు ఫలించలేదు. అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయాయి ఈ రెండు సినిమాలు.

అయితే, ‘వినయ విధేయ రామ’ రిజల్ట్‌ చూసి అభిమానులకు చరణ్‌ క్షమాపణలు చెప్పి, పెద్ద మనసు చాటుకున్నాడు. ఈ సినిమా ఫ్లాప్‌ అని స్వయంగా ఒప్పుకున్నాడు. కానీ, అనూహ్యంగా సినిమా నష్టాల్ని తగ్గించుకోగలిగింది. 70 కోట్లు పైన షేర్‌ సాధించింది. దాంతో నిర్మాతలు సేఫ్‌ జోన్‌లోకి వెళ్లారు. ఒకవేళ హిట్‌ టాక్‌ వచ్చి ఉంటే, 125 కోట్లు ఈజీగా కొల్లగొట్టేదే. కానీ మంచి ఛాన్స్‌ మిస్‌ అయ్యాడు చరణ్‌.

సైరా విషయానికి వస్తే, కేవలం తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు పైన షేర్‌ సాధించింది. తెలుగు వెర్షన్‌కి సంబంధించినంతవరకూ ఈ సినిమా సూపర్‌ హిట్టే. కానీ, హిందీలోనూ, ఇతర భాషల్లోనూ దారుణంగా ఫెయిల్‌ అయ్యింది. ప్రమోషన్‌ సరిగ్గా లేకపోవడంతో ఆయా భాషల్లో సినిమా ఫెయిల్‌ అయ్యింది అదే ప్రమోషన్‌ సరిగ్గా చేసి ఉంటే రిజల్ట్‌ ఇంకాస్త బెటర్‌గా ఉండేది. 2020లో హీరోగా చరణ్‌ నుండి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, నిర్మాతగా తండ్రి చిరంజీవితో ఓ సినిమా చరణ్‌ డైరీలో ఉన్నాయి. చూడాలి మరి, ఈ ఏడాది చరణ్‌ కెరీర్‌ ఎలా ఉండబోతోందో.