బాలీవుడ్ సెలబ్రెటీల బాడీ గార్డ్స్ జీతాలు కోట్లలో… తెలిస్తే షాక్ అవ్వాలసిందే
బాలీవుడ్ సెలబ్రెటీల పారితోషికాలు, సినిమా బడ్జెట్ లు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అయితే వారి సినిమాలే కాదు, వారి వ్యక్తిగత బాడీ గార్డ్ లకు ఇచ్చే జీతాలు కూడా కోట్లలో ఉన్నాయి. కొందరు అయితే రెండున్నర కోట్ల వరకు జీతాలు ఇస్తున్నారు. టాప్ సిక్స్ సెలబ్రెటీ బాడీ గార్డ్స్ జీతాలు ఇవే… బాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పడుకొనే బాడీ గార్డుకు అత్యధికంగా శాలరీలు ఇచ్చే స్థానంలో ఉన్నది.
ఆమె వ్యక్తిగత బాడీ గార్డ్ కు ఏడాదికి 80 లక్షలు జీతం ఇస్తుంది. బాలీవుడ్ బిగ్ బీ.. అమితాబచ్చన్… వీరికి వ్యక్తిగత బాడీ గార్డ్ గా జితేంద్ర షిండే పని చేస్తున్నారు. ఆయనకు సంవత్సరానికి కోటీ యాబై లక్షల రూపాయలను జీతంగా ఇస్తున్నారు అమితాబ్. అక్షయ్ కుమార్ బాడీ గార్డ్ శ్రేయాస్ టెలి పనిచేస్తున్నాడు. అయనకు అక్షయ్ కోటి ఇరవై లక్షలు జీతం ఇస్తున్నాడు.
ఆమిర్ ఖాన్… ఈయన బాడీగార్డ్ యువ్ రాజ్ గోర్పాడే.. యువ్ రాజ్ కు సంవత్సర జీతం రెండు కోట్ల రూపాయలు. సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ పేరు షేరా, ఈయనకు సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తున్నాడు. షారూక్ ఖాన్… బాడీ గార్డ్ పేరు రవి… ఇతనికి షారూక్ ఇచ్చే జీతం 2.50 కోట్ల రూపాయలు.. సెలబ్రిటీల బాడీగార్డులకు ఇచ్చే జీతంలో అత్యధికంగా రవికే దక్కుతున్నాయి.