ఈ మెగా హీరో సినిమా పరిస్థితి ఏమిటో…రిలీజ్ అవుతుందా…లేదా…???
మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్ తప్ప మరే హీరో పెద్దగా సోదిలో లేడు. ‘అల వైకుంఠపురములో..’ సినిమాతో అల్లు అర్జున్ హైప్లో ఉన్నా, మెగా కాంపౌండ్ నుండి అల్లు అర్జున్ సెపరేట్ అయిపోయాడన్న గుసగుసలు ఎలాగూ ఉన్నాయి. రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ అలా అలా నడుస్తోంది. ఇక వరుణ్ తేజ్ నుండి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇక మెగా కాంపౌండ్ నుండి డెబ్యూ చేస్తున్న హీరో వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’ సినిమాతో ఈ మెగా హీరో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా, మైత్రీ మూవీస్ బ్యానర్లో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తాజాగా సోదిలోకి వచ్చింది. దాదాపు 70 శాతం సినిమా పూర్తయ్యిందట. అవుట్ పుట్ చాలా బాగా వస్తోందట. గురువుగారు సుకుమార్ అవుట్ పుట్ పరిశీలించి చాలా బాగా వచ్చిందంటూ కితాబిచ్చాడట. దాంతో సినిమా సూపర్ హిట్ అనే టాక్ వినిపిస్తోంది. మెగా హీరో డెబ్యూ మూవీ సంచలనాలకు వేదికవుతుందని భావిస్తున్నారు. 2019లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు రెండేసి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి, సూపర్ స్పీడుమీదున్నారు. ఇక వచ్చే ఏడాది మెగా కాంపౌండ్ సందడి ఎలా ఉండబోతోందో చూడాలిక.