Movies

విజయ్ దేవరకొండ సక్సెస్ సీక్రెట్ ఇదే…!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ పేరు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మారుమ్రోగిపోతోంది. వ‌రుస చిత్రాల‌తో సినిమా సినిమాకు త‌న క్రేజ్‌ని పెంచుకుంటూ పోతున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. రౌడీ పేరునే త‌న బ్రాండ్‌గా మార్చుకుని అభిమానులంద‌రికి ప్రియ‌మైన రౌడీగా మారిపోయారు. `అర్జున్‌రెడ్డి`తో హీరోగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న విజ‌య్ ఏది చేసినా ఇప్ప‌డు వైర‌ల్ అయిపోతోంది. హీరోగానే కాకుండా బ్రాండింగ్‌లోనూ త‌న‌దైన ముద్ర వేస్తున్న విజ‌య్ కొత్త ఫిలాస‌ఫీని చెబుతున్నారు.

ఇటీవ‌ల ఓ టీవి ఛాన‌ల్ నిర్వ‌హించిన య‌ల‌వ న‌క్ష‌త్ర స‌న్మానం కార్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా ఈ కార్య‌క్ర‌మంలో అవార్డుని స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా త‌న ఎదుగుద‌ల‌కు సంబంధించిన సీక్రెట్‌ని బ‌య‌ట‌పెట్టేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌నం ఎక్స్‌ట్రార్డిన‌రీ అనిపించుకోవాలంటే ఆర్డిన‌రీ జ‌నాలు ఏం చేస్తారో వారి కంటే భిన్నంగా ఎక్స్ ట్రా చేయాలి. అంతా 6కి నిద్లేస్తే మ‌నం 5కే నిద్ర‌లేచి ప‌ని మొద‌లుపెట్టాలి. ఎదుటి వాడు 1 కిలోమీట‌ర్ ప‌రుగెడితే వాడికి మించి కిలోమీట‌ర్ న‌ర ప‌రుగెత్త‌డానికి సిద్ధంగా వుండాలి. ఇదే నేను బ్లైండ్‌గా న‌మ్ముతున్న‌ది` అని త‌న స‌క్సెస్ సీక్రెట్‌ని బ‌య‌ట‌పెట్టారు.

టాలీవుడ్‌లో ఇప్పుడున్న హీరోల‌కు భిన్నంగా అడుగులు వేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చే ఏడాది త‌న కెరీర్‌ని చాలా కొత్త‌గా ప్లాన్ చేసుకున్నారు. క్రాంతి మాధ‌వ్ డైరెక్ష‌న్‌లో `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వర్‌`, పూరి తో `ఫైట‌ర్‌` చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో `ఫైట‌ర్‌` బాలీవుడ్‌లోనూ విడుద‌ల కాబోతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు.