Movies

టాలీవుడ్ లో వీళ్ళ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

సినిమా రంగంలో ఒక్కరికి ఒక్కొక్క టైం వస్తుందని అంటారు. ఇక టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి సంపాదన ఎక్కువగా ఉంటుంది? అని అడిగితే స్టార్ హీరోల పేర్లు చెప్పేస్తాం. కాకపొతే స్టార్ డైరెక్టర్ల పేర్లు చెప్తారు. ఇక కమెడియన్ల పేర్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు చెప్పడానికి సాహసం చేయలేరు. అయితే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు అధిక రెమ్యునరేషన్ జాబితాలో చేరిపోతున్నాయి. అందులో ప్రధానంగా వెన్నెల కిషోర్.. రావు రమేష్ ల గురించే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ , కాగా టాప్ లీగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావు రమేష్ ఉన్నారు.

ఇప్పుడు హీరోల కంటే వీరి డేట్స్ సంపాదించడమే ఫిలిం మేకర్లకు కష్టంగా మారిందట. ఈమధ్య రిలీజ్ అయిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో హీరో తేజు పాత్ర కంటే రావు రమేష్ పాత్ర హైలైట్. అలాగే వెన్నెల కిషోర్ కూడా సరైన పాత్ర పడితే తనదైన శైలిలో ఒదిగిపోతాడు. రావు రమేష్ లాగా సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తాడు. అందుకే వెన్నెల కిషోర్.. రావు రమేష్ పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉందని అంటున్నారు. ఒక రోజు కాల్ షీట్ కు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలట.

ఈ స్థాయిలో సినిమాకు ప్లస్ గా మారే నటులు టాలీవుడ్ లో చాలా తక్కువమంది ఉండడంతో ఫిలిం మేకర్స్ కూడా పట్టుబట్టి మరీ వీరిని సినిమాలో పెడుతున్నారట. ఈమధ్య కమెడియన్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు కొంచెం గుర్తింపు రాగానే హీరోలుగా మారుతున్నారు. మాస్ హీరోలుగా ఊహించుకుంటూ తమ మార్కెట్ ను తామే చేజేతులా పాడు చేసుకుంటున్నారు. కానీ వెన్నెల కిషోర్, రావు రమేష్ మాత్రం అలా చెయ్యకుండా తమ పాత్రలకు న్యాయం చేస్తూ తమకు తామే సాటి అవుతున్నారు.