Movies

చంద్ర టీమ్ లో ఉండే లేడీ ఆర్టిస్ట్ గురించి షాకింగ్ నిజాలు

బుల్లితెర మీద ఎన్నో ప్రోగ్రామ్స్ జనాల్ని బాగానే ఆకర్షిస్తున్నాయి. కొన్ని ప్రోగ్రామ్స్ అయితే టాప్ రేంజ్ లో ఉంటున్నాయి. అందులో ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ని చెప్పుకోవాలి. ఇందులోని స్కిట్స్ ,కమెడియన్స్ ఫెర్మారెన్స్ కారణంగా ఈ షోకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. స్టార్ట్ అయిన దగ్గర నుంచీ ముగిసేవరకూ చూసే షో గా ఇది పేరుతెచ్చుకుంది.

ఇక ఇందులో నటించిన ఎందరో కమెడియన్స్ కి జీవితాల్ని ఇచ్చింది. సుడిగాలి సుధీర్, చమక్ చంద్ర,రాఘవ,హైపర్ అది,ఆర్ఫీ,ఇలా చాలామంది టీమ్ లీడర్స్ ఉన్నారు. ఈ షోలో కొందరు లేడీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కమెడియన్స్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇందులో చమక్ చంద్ర టీమ్ లోని సత్య గురించి ప్రధానంగా ప్రస్తావించాలి.

సత్య ఆర్ ఎక్స్ 100,రాజా ది గ్రేట్ వంటి సినిమాల్లో సపోర్టింగ్ నటిగా నటించింది. జబర్దస్త్ లో కనిపించేదానికి రియల్ లైఫ్ లో కనిపించేదానికి అసలు పోలిక ఉండదు. సత్య తాజాగా విడుదల చేసిన వీడియో చూస్తే,వావ్ అంటాం. రియల్ లైఫ్ కి,కామెడీ షోకి గల వ్యత్సాసం చూసిన నెటిజన్లు కామెంట్స్ తో అదరగొట్టేస్తున్నారు.