Movies

ఒకప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు మనం రోజు బుల్లితెరపై చూస్తున్న సీరియల్ హీరోయిన్

సినిమా నటులను మించిన క్రేజ్ తో బుల్లితెర నటులు కూడా కెరీర్ లో దూసుకెళ్తున్నారు. గతంలో టివి రంగంలో రాణించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఛాన్స్ లు అందిపుచ్చుకుని రాణిస్తున్నారు. ముఖ్యంగా జి తెలుగు,జెమిని,మా,ఈటివి ఇలా అన్ని చానల్స్ లో సీరియల్స్ లో నటిస్తున్న వారికి ఎక్కడ లేని పేరూ వస్తోంది.

పైగా సినిమా అయినా చూస్తున్నారో లేదో గానీ,టివి సీరియల్ చూడని వాళ్లంటూ ఉండడం లేదు. అంతగా సీరియల్స్ జనంలోకి దూసుకెళ్లాయి. అందుకే ఆర్టిస్టులు తమ నటనతో కుమ్మేస్తున్నారు. అయితే ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న గంగ మంగ సీరియల్ విపరీతమైన ప్రేక్షకాదరణతో నడుస్తోంది. సినీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ నుంచి జాలువారిన కథ ఆధారంగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ లో లీడ్ రోల్ పోషిస్తున్న ప్రణవి కి మంచి ఇమేజ్ వచ్చింది. ఈ సీరియల్ ని ప్రమోట్ చేయడానికి టాలీవుడ్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొన్నాడట.

ఈ సీరియల్ ఆయనే ప్రమోట్ చేసాడట. ఓ మూవీ రేంజ్ లో ఈ సీరియల్ ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. చిన్నప్పుడు విడిపోయిన అక్కా చెల్లెళ్లలో ఒకరు పద్దతిగా పెరిగితే,మరొకరు పొగరుబోతుగా ఉంటారు. ఇందులో గంగ పాత్రను ప్రణవి పోషించి, పల్లెటూరి అమ్మాయిగా ఆదరణ పొందుతోంది. ఇక ప్రణవి ఎవరీ మోహిని,కథలో రాజకుమారి,వంటి సీరియల్స్ లో నటించింది. ఈమె ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా రాణించింది. ఉయ్యాలా జంపాల ,మిణుగురులు, మనమంతా వంటి సినిమాల్లో బాలనటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.