హీరో రాజశేఖర్ ఆస్తి విలువ ఎంతో తెలిస్తే షాకవుతారు
వందేమాతరం మూవీతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో డాక్టర్ రాజశేఖర్ తెలుగు, తమిళ భాషల్లో 50కి పైగా సినిమాల్లో చేశారు. రెండు దశాబ్దాల పాటు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా డాక్టర్ రాజశేఖర్ పోలీస్ పాత్రల్లో ఇమిడిపోయాడు. అంకుశం లాంటి సినిమాలు రాజశేఖర్ కి స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి.
అంతేకాదు ఫామిలీ ఓరియెంటెడ్ మూవీస్ తో తనదైన రీతిలో నటించి మెప్పించాడు. అల్లరి ప్రియుడు వంటి చిత్రాలు ఈకోవలోకే వస్తాయి. మెడిసిన్ చదివి యాక్టర్ అయిన డాక్టర్ రాజశేఖర్ ఏడాదికి ఎంత సంపాదిస్తారు,అసలు ఈయన ఆస్తి ఎంత వంటి విషయాల్లోకి వెళ్తే షాక్ తినాల్సిందే.
రాజశేఖర్ ఆస్తి 35కోట్లు. ఏడాదికి 5కోట్లు నుంచి 7కోట్ల సంపాదన. హైదరాబాద్ లో నివాసం ఉండే ఇల్లు రెండు కోట్లు ఖరీదు చేస్తుంది. రాజశేఖర్ కి రెండు సూపర్ లగ్జరీ కార్లు ఉన్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన రాజశేఖర్ ఇటీవలే రాజీనామా చేసాడు.