సుడిగాలి సుదీర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా…టాలీవుడ్ హీరో సరిపోడు
జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది కంటెస్టెంట్స్ బుల్లితెరపై ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నారు. ఒకప్పుడు పైసా చేతిలో లేక ఇబ్బంది పడ్డవాళ్ళు ఈ షోతో ఆర్ధికంగా కూడా స్థిరపడ్డారు. అంతోఇంతో కూడా బెట్టారు కూడా. ఇక కామెడీకి పెట్టింది పేరుగా ఈ షోలో రాణిస్తున్న సుడిగాలి సుధీర్ చాలా సినిమాల్లో సైడ్ రోల్ ,ముఖ్య పాత్రలు కూడా పోషించాడు.
మొదట్లో మెజీషియన్ గా పనిచేసిన సుడిగాలి సుధీర్ ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి, తనదైన ముద్ర వేసాడు. ఎంత ఎదిగినా సరే, తాను పడిన కష్టాన్ని మరిచిపోకుండా చెబుతూ ఉంటాడు. సింపుల్ గా ఉంటాడు. ఇంకా ఎన్నో టివి షోస్ లో తనదైన బాణీ లో వెళ్తున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఎంత సంపాదిస్తున్నాడు. అతడి ఆస్తి ఎంత ,టోటల్ నెట్ వర్త్ ఎంతుంది వంటి విషయాల్లోకి వెళ్తే,అతడి ఆస్తి మూడు నుంచి ఐదుకోట్ల ఆస్తి ఉంది. ఏడాదికి 25నుంచి 35లక్షలు సంపాదిస్తున్నాడు. జబర్దస్త్ ఒక్క ఎపిసోడ్ కి 50వేలు తీసుకుంటున్నాడు. ఒక్క సినిమాకి 75లక్షలు నుంచి 80లక్షలు అందుకుంటున్నాడు.