Movies

స్టైలిష్ స్టార్ కి స్టైలిష్ బ్రాండ్ క్లోత్స్ ని గిఫ్ట్ ఇచ్చిన దేవరకొండ

అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో చిత్రం జనవరి 12 న రేపు విడుదల కి సిద్ధంగా వుంది. అయితే ఆ చిత్ర సెలెబ్రేషన్స్ లో రౌడీ బ్రాండ్ దుస్తుల్ని అల్లు అర్జున్ వేసుకోనున్నారు. అయితే అల్లు అర్జున్ చాల సార్లు విజయ్ దేవరకొండ స్టైల్ ఫై, అట్టిట్యూడ్ ఫై కామెంట్లు చేసారు. తాజా ఇంటర్వ్యూ లో కూడా విజయ్ దేవరకొండ మీద పొగడ్తల వర్షం కురిపించాడు. అయితే విజయ్ దేవరకొండ ప్రామిస్ చేసినట్లుగా అల్లు అర్జున్ కి తన బ్రాండ్ ROWDY దుస్తుల్ని బహుమానంగా పంపడం జరిగింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేసారు.

విజయ్ దేవరకొండ కి కృతజ్ఞతలు చెబుతూ అల్లు అర్జున్ ఇలా అన్నారు. విజయ్ పంపిన దుస్తులు అద్దిరిపోయినట్లుగా ఉన్నాయని, ప్రామిస్ చేసినట్లుగా పంపావు, ఈ దుస్తుల్ని అలా వైకుంఠపురంలో చిత్ర సెలెబ్రేషన్స్ కు గాను వేసుకుంటానని, ఆ సెలెబ్రేషన్స్ లో రౌడీ దుస్తులతో కనిపిస్తానని అన్నారు. అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఆ వేడుకలు చూసేందుకు ఇప్పటినుండి ఆరాటపడుతున్నారు.