Politics

నారా లోకేష్ నిజమైన ఆస్తి విలువ తెలుసా ?

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు అయిన మాజీ మంత్రి నారా లోకేష్ టిడిపి యువతరం నాయకుడిగా ఉన్నారు. ఎమ్మెల్సీ గా ఎన్నికై ఐటి మినిష్టర్ గా సేవలందించిన ఈయన నటసింహం నందమూరి బాలయ్య పెద్ద అల్లుడు కూడా. బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణిని వివాహమాడిన లోకేష్ కి దేవాన్ష్ అనే కొడుకున్నాడు.

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసిన లోకేష్ అక్కడ ఓటమి చవిచూశాడు. పాపులార్టీ గల లోకేష్ ఆస్తి ఎంత, ఏడాదికి ఎంత సంపాదిస్తారు, వంటి విషయాల్లోకి వెళ్తే, ఎన్నికల అఫిడవిట్ ప్రకారం లోకేష్ ఆస్తి దాదాపు 350కోట్లు. ఏడాదికి 10నుంచి 15కోట్లు సంపాదిస్తాడు.

విదేశాల్లో హోటల్స్,ట్రావెల్ ఏజన్సీలు లోకేష్ ప్రయివేట్ గా నిర్వహిస్తుంటారు. హైదరాబాద్ లో 5కోట్లు విలువచేసే ఇల్లు,అలాగే గుంటూరులో 3కోట్లు విలువ చేసే ఇల్లు ఉన్నాయి. రెండు సూపర్ లగ్జరీ కార్లు మెయింటేన్ చేస్తున్నారు. అయితే ఇతని నిజమైన ఆస్తి పట్టుదల అంటాడు. 1995నుంచి మంగళగిరిలో టిడిపి జెండా ఎగరలేదు. అందుకే అక్కడే పోటీచేసి నెగ్గాలని పట్టుదలతో పోటీచేశాడు.