Movies

రష్మిక గ్లామర్ సీక్రెట్ ఏమిటో తెలుసా?

సరిలేరు నీకెవ్వరూ మహేష్ బాబుని క్యూట్ అన్నాను కానీ, నిజానికి నేను కూడా సో క్యూట్, సో స్వీట్ అని అంటుంది రష్మిక. ఎందుకంటే వెజిటేరియన్ గా మారిపోయాను. అయితే నాకు కూరగాయలు ఏవి ఇష్టం ఉండదు. టమాటా, బంగాళాదుంపలు, దోసకాయ, క్యాప్సికం తినను అంటుంది. ఈమధ్య ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఇటలీ వెళ్తే అక్కడ కూరలు తినలేక ఐస్ క్రీం తిని కడుపునింపుకున్నానని రష్మిక తెలిపారు.

ప్రతిరోజు ఉదయం లేవగానే లీటర్ నీరు తాగుతాను…. వర్కౌట్స్ చేస్తాను. ఒకవేళ ఉదయం షూటింగ్ ఉంటె సాయంత్రమైన సరే ఎక్సర్సైజ్ లు చేస్తానని తెలిపింది. దక్షిణాది వంటలు ఎక్కువగా ఇష్టపడుతుందట. అన్నం తక్కువగా తిని ఫ్రూట్స్, సలాడ్స్ ఎక్కువగా తింటానని చెబుతుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నీకు అర్ధమవుతుందా అంటూ సందడి చేసిన రష్మిక ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది.