Movies

“ఎంత మంచివాడవురా” సినిమా రివ్యూ…హిట్టా…ఫట్టా…???

తెలుగు తెరపైకి ఈ సంక్రాంతి రేస్ లో విడుదల కాబడిన చిత్రాల్లో హీరో కళ్యాణ్ రామ్ మరియు హీరోయిన్ మెహ్రీన్ లు జంటగా “శతమానం భవతి” అనే చిత్రంతో గతంలో వచ్చిన సంక్రాంతికి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన మరో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఎంత మంచివాడవురా” చిత్రం ఈరోజే సంక్రాంతి కానుకగా విడుదలయింది.మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :
ఇక కథ లోకి వెళ్లినట్టయితే బాలు(కళ్యాణ్ రామ్) ఎవరికైతే పలు కుటుంబాలకు పరిస్థితులకు అనుగుణంగా ఒక కుటుంబ సభ్యుడు కావాలి అనుకుంటారో వారి కోసం సహాయం చేస్తూ ఉంటాడు.అలాగే మరోపక్క విలన్ రాజీవ్ కనకాల ఇసుక మాఫియాలో తిరుగులేని రారాజుగా ఉంటాడు.అయితే ఇదే నేపథ్యంలో తనికెళ్ళ భరణి పాత్ర మూలంగా కళ్యాణ్ రామ్ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి.అసలు కళ్యాణ్ రామ్ పాత్ర ఎందుకు ఇలా ఉంది.అతనికి సంబంధించిన జీవితం ఏమిటి?చివరకు ఈ కథ ఎలా ముగిసింది అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ :
మొదటిగా ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది ఈ సినిమా తాలూకా కాన్సెప్ట్ అని చెప్పాలి.తాను అనుకున్న కాన్సెప్ట్ ను దర్శకుడు సతీష్ వేగేశ్న ఎమోషన్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ తో బాగా డిజైన్ చేసుకున్నారు.టీజర్ మరియు ట్రైలర్ లలో వాటిని పెద్దగా రివీల్ చెయ్యకపోయినా థియేటర్ లో చూసినపుడు మాత్రం వారు ఎన్నుకొన్న పాయింట్ కాస్త ఆసక్తికరంగాను అలాగే విచిత్రంగాను అనిపిస్తుంది.అలా మంచి ఎమోషన్స్ మరియు చిన్న చిన్న ట్విస్టులతో దర్శకుడు ఫస్ట్ హాఫ్ ను నడిపిస్తారు.
అయితే ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమా అంటే ఫన్ కూడా తప్పనిసరి కానీ ఫస్ట్ హాఫ్ లో అంతగా ఎక్కగా ఆ ఫన్ కనిపించదు.కేవలం ఎమోషన్స్ తో హ్యాండిల్ చేసుకుంటూ వెళ్లిపోయారు.ఇక సెకండాఫ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా మంచి ఎమోషన్స్ తో పాటుగా ఫస్ట్ హాఫ్ లో మిస్సయిన కామెడీని జోడించారు.అయితే ఫస్ట్ హాఫ్ లోని తాము ఎంచుకున్న మెయిన్ పాయింట్ ను వీటి మూలాన పక్క దారి పట్టినట్టు అనిపిస్తుంది.

అలా అని కామెడీ కూడా బాగోలేదని కాదు.ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు ఎన్నుకున్న అద్భుతమైన పాయింట్ ను ఎంతైతే బ్యాలన్సుడ్ గా నడిపించారో ఆ బ్యాలన్స్ సెకండాఫ్ లో తప్పడం సుస్పష్టంగా కనిపిస్తుంది.ఇంకా చెప్పాలి అంటే పూర్తిగా కథ బాగా బలహీన పడినట్టు అనిపిస్తుంది.అంతే కాకుండా నెమ్మదిగా సాగే కథనం,రొటీన్ ఎమోషన్స్ వంటివి మరింత దెబ్బ తెస్తాయి.ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సింది.అయితే సెకండాఫ్ లో క్లైమాక్స్ కూడా పెద్ద ఆకట్టుకునే స్థాయిలో లేదు ఇది కూడా నిరాశపరిచే అంశం.

ఇక నటీనటుల విషయానికి వస్తే నిర్మొహమాటంగా కళ్యాణ్ రామ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారని చెప్పాలి.ఒకపక్క లుక్స్ పరంగా కానీ మంచి ఎమోషన్స్ అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా చక్కనైన నటన కనబర్చారు.అలాగే హీరోయిన్ నందినిగా మెహ్రీన్ కూడా మంచి నటనను కనబరిచింది.సాంగ్స్ లో మరింత అందంగా కనిపించింది.అలాగే చాలా సీనియర్ నటులు శరత్ కుమార్ మరియు సుహాసినీలు మంచి పాత్ర పోషించారు.

అలాగే మరో ముఖ్య నటుడు తనికెళ్ళ భరణి మరియు కళ్యాణ్ రామ్ ల మధ్య వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్ లో వారై నటన చాలా బాగుంది.అలాగే నెగిటివ్ రోల్ కనిపించిన రాజీవ్ కనకాల మరోసారి తనదైన విలనిజాన్ని చూపించారు.అలాగే నరేష్,వెన్నెల కిశోర్ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు మంచి నటనను కనబర్చారు.అలాగే గోపి సుందర్ అందించిన సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓవరాల్ గా ఓకే అనిపిస్తాయి.రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :
కళ్యాణ్ రామ్ పెర్ఫామెన్స్, కాస్త ఆసక్తికరం అనిపించే పాయింట్,సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ

మైనస్ పాయింట్స్ :
బలహీనమైన క్లైమాక్స్,నెమ్మదిగా సాగే కథనం,రొటీన్ ఫ్యామిలీ ఎమోషన్స్