Movies

బసవ తారకాన్ని పెళ్లి చేసుకున్న కారణంగా కక్ష్య కట్టిన పినతండ్రి ఏమి చేసాడో తెలుసా?

తెలుగు చిత్ర సీమలో ఎన్టీఆర్ లాంటి నటుడు,ప్రజా నాయకుడు మరొకరు ఇప్పటిలో పుట్టారంటే అతిశయోక్తి కాదు. అందుకే ఎన్టీఆర్ మరణించినపుడు వచ్చిన జనం చూస్తే,ఆయన పట్ల ప్రజల్లో ఆదరణ తెలుస్తుంది.1923మే28న నిమ్మకూరులో లక్ష్మయ్య చౌదరి,వెంకట్రావమ్మ దంపతులకు ఆలస్యంగా పుట్టారు. లక్ష్మయ్య చౌదరికి తండ్రి నుంచి 20ఎకరాలు వాటాగా వచ్చాయి. ఎన్టీఆర్ పుట్టిన నాలుగేళ్లకు తమ్ముడు పుట్టాడు. పేరు పెట్టడంలో ఎన్టీఆర్ కి వరుసకు చిన్నాన్న అయ్యే సోకు రామయ్య కీలక పాత్ర పోషించారట. మొదట్లో కృష్ణుడు పేరుపెట్టాలని తల్లి అనుకుందట. అయితే రాముడి పేరు పెట్టేయడంతో ఎన్టీఆర్ చేతిమీద ఆమె కృష్ణుని పచ్చబొట్టు పొడిపించింది. సోకు రామయ్యకు పిల్లలు లేరు.

ఇక ఎన్టీఆర్ ఐదేళ్ల వయస్సులో ఎన్టీఆర్ కి అక్షరాభ్యాసం చేయించడానికి ముందు వల్లూరు వెంకన్న పంతులు గారి దగ్గరకు తీసుకెళితే, పాద సాముద్రికం చూడాలంటూ, పళ్లెంలో పిండి పోసి పిల్లవాడిని అందులో నించోమన్నారట. ఆతర్వాత పాదముద్రలు చూస్తే అరికాళ్లలో శంఖుచక్రాలు ఉన్నట్లు కనిబడిందట. మహార్జాతకుడని చెప్పారట. నిడుమోలు గ్రామంలో వల్లూరు సుబ్బయ్య పంతులు దగ్గర 1,2,3తరగతులు చదివిన ఎన్టీఆర్ ఆతర్వాత మునసబు గారింటిలో జరిగే ఇంగ్లీషు బడిలో చదివారు. ఇక సోకు రామయ్య దంపతులు విజయవాడలో మకాం పెట్టడంతో ఎన్టీఆర్ ని వారి దగ్గరే ఉంచుకుని హైస్కూల్ చదువు చదివించారు.

సైకిల్ మీద ఎన్టీఆర్ ని కూర్చోబెట్టుకుని దుర్గా కళా మందిర్ కి తీసుకెళ్లి నాటకాలు చూపించేవారట. ఆవిధంగా నాటకాలపై మక్కువ కలిగింది. ఇక ఎన్టీఆర్ కి హైస్కూల్ చదువు పూర్తయ్యేసరికి సోకు రామయ్య ఆస్థి కూడా కరిగిపోయింది. ఇక లక్ష్మయ్య చౌదరి నాలుగు గేదెలు కొని పాల వ్యాపారం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ హీరో సైకిల్ పై పాలు పోస్తూ, కాలేజీకి వెళ్లేవారు. 40కావిడల నీళ్లు ఇంటికి తెచ్చేవారట.

అయితే ఇంటర్ చదివిసమయంలోనే ఎన్టీఆర్ తల్లి కజిన్ బ్రదర్ కూతురు అయిన బసవతారకం ను ఎన్టీఆర్ పెళ్లిచేసుకున్నారు. అయితే ఇక్కడ ఒక గొడవ కూడా అయిందట. ఎందుకంటే ఎన్టీఆర్ పినతండ్రి తన మరదల్ని ఇచ్చి పెళ్ళిచేయాలనుకున్నాడు. ఎటు మొగ్గాలో తెలియక చివరకు బసవతారకాన్ని చేసుకోవడానికి నిర్ణయించుకోవడం, తల్లిదండ్రులిద్దరూ పెళ్లికి రాకపోవడంతో సోకు రామయ్య దగ్గరుండి పెళ్లి జరిపించాడు. దీంతో లక్ష్మయ్య చౌదరిపై ఎన్టీఆర్ పినతండ్రి కక్ష గట్టి,ఆయన పొలాన్ని ఆయన పేరున రాయకుండా మోసగించాడు. అయితే ఎన్టీఆర్ సినిమాల్లో నిలదొక్కుకున్నాక పోయిన ఆస్తులన్నీ సాధించారు.