అల వైకుంఠపురంలో నటించిన టబుకి 15 నిమిషాలకు ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా?
చాలా కాలం తరవాత తెలుగు తెరపై మెరిసింది టబు. అల వైకుంఠపురమలో ఓ రిచ్ మమ్మీ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాలో ఆమె కనిపించింది కాసేపే. ఆమె స్థాయికి తగిన పాత్ర కూడా కాదు. తాను మాత్రమే చేయాల్సిన పాత్ర అస్సలు కాదు. కానీ.. ఏకంగా రూ.3 కోట్ల పారితోషికం పట్టుకెళ్లిపోయిందట. ఔను… ఈ సినిమా కోసం టబు అక్షరాలా మూడు కోట్లు అందుకుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం విజయశాంతికీ అంతే ఇచ్చారు.
అయితే విజయశాంతి పాత్ర అందులో చాలా కీలకమైనది. ఆమె స్థాయికి తగిన పాత్రే కట్టబెట్టాడు అనిల్ రావిపూడి. కానీ అల వైకుంఠపురములో విషయంలో మాత్రం అది జరగలేదు. టబు ని కేవలం స్టేచర్ చూపించడానికి వాడుకున్నారనిపిస్తుంది. తను చక్కగా పది రోజులు కాల్షీట్లు ఇచ్చి, ఏకంగా రూ.3 కోట్లు రాబట్టుకుంది. ఇన్నేసి డబ్బులు ఇస్తారంటే, ఎవరు మాత్రం కాదంటారు..?? టబుకి మాత్రం వీరలెవిల్లో గిట్టుబాటు అయ్యింది.