నెల తిరగకుండానే లవర్స్ ని మార్చేసిన టాలీవుడ్ సెలబ్రేటిస్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు,పెళ్లిళ్లు,విడిపోవడం ఇవన్నీ మామూలే. శోభన్ బాబు,జయలలిత మధ్య ప్రేమ నడిచిందని అంటారు. వారిద్దరూ చనిపోయాక కూడా ఎక్కడో అక్కడ వారి గురించి ప్రస్తావన వస్తుంటుంది. ఆ మధ్య లవర్ బాయ్ తరుణ్ ,ఆర్తి అగర్వాల్ లవ్ చేసుకుని పెళ్లి పీటలు ఎక్కాలని ముచ్చట పడినట్లు టాక్ వచ్చింది. అంతేకాదు, ఆర్తి గర్భవతి కూడా అయిందన్న వార్తలు వచ్చాయి. అయితే తరుణ్ తల్లి రోజా రమణి వాళ్ళ ప్రేమను ఒప్పుకోలేదని తెల్సింది. దాంతో వాళ్ళ మధ్య బ్రేక్ అప్ వచ్చేసింది. మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజ్,రెజీనా గాఢంగా ప్రేమించుకున్నారని వార్తలొచ్చాయి. దీంతో ఆమె కెరీర్ పై ప్రభావం పడింది. తనతో ఎలాంటి సంబంధం లేదని సాయిధరమ్ చెప్పడంతో ఎవరి కెరీర్ లో వాళ్ళు ముందుకు వెళ్ళేపనిలో పడ్డారు.
తమిళ హీరో శింబు గురించి అందరికీ తెల్సిందే. చాలామందితో ప్రేమ నడిపాడు. నయనతారతో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు. అయితే ,చివరకు ప్రభుదేవాతో ఆమె ఫిక్స్ చేసుకుంది. అయితే ఈమెకు ప్రభుదేవా తన భార్య పిల్లలను దూరం చేసుకున్నాడు. ఇక అమలాపాల్, విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హీరోయిన్ అంజలి కి జర్నీ ఫిలిం హీరో జై తో ఎఫైర్ నడిచింది. ఇక ఆమె లావెక్కడంతో సినిమాలు తగ్గాయి. సన్నగా అవ్వడానికి ట్రై చేయడంతో ఆమెను జై వదిలించుకున్నాడని టాక్.
త్రిష ,రానా మధ్య ప్రేమాయణం నడిచినా, ఒకరికొకరు సరిపోరని విడిపోయారట. శృతి హాసన్, ఇలియానా కూడా ఫారిన్ బాయ్ ఫ్రెండ్స్ కి బ్రేక్ అప్ చెప్పేసి కెరీర్ పై దృష్టి పెట్టారు. అక్కినేని అఖిల్,శ్రేయ భోపాల్ మధ్య ప్రేమాయణం పెళ్లి వరకూ వచ్చి,ఇద్దరి మధ్యా బేధాభిప్రాయాల మధ్య పెళ్లి కేన్సిల్ అయింది. తమిళంలో విశాల్ ,వరలక్ష్మి ప్రేమించుకున్నారు. దీనికి ఆమె తండ్రి శరత్ కుమార్ ఒప్పుకోకపోవడంతో నడిగర సంఘం ఎన్నికల్లో పట్టుబట్టి విశాల్ ఆడించినట్లు వార్తలొచ్చాయి. దీంతో వరలక్ష్మి కేరీర్ మీద దృష్టి పెట్టి, లేడి విలన్ గా చేస్తోంది. హిట్స్ అందుకుంటూ సత్తా చాటుతోంది. విశాల్ మరో ఆమెతో ప్రేమలో పడ్డాడు.