మాస్టర్ భరత్ గుర్తు ఉన్నాడా.. సినిమాల్లోకి రావటానికి కారణం ఎవరో తెలుసా?
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించినటువంటి రెడీ చిత్రంలో చిట్టినాయుడు గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అటువంటి మాస్టర్ భరత్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.భరత్ చిన్నప్పటి నుంచి పలు కామెడీ సన్నివేశాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే వాడు.
అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలోని కొన్ని సంఘటనల గురించి తన అభిమానులతో పంచుకున్నాడు.ఇందులో భాగంగా తాను పుట్టి పెరిగింది చెన్నైలోనేనని, దాంతో తన విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగిందని చెప్పుకొచ్చాడు.అలాగే తన తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి అని ఉద్యోగరీత్యా తమ కుటుంబ సభ్యులు చెన్నైలోనే స్థిరపడ్డారని తెలిపారు.అలాగే తనకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టమని అందువల్లనే పలు సినిమాల ఆడిషన్లకు హాజరయ్యేవాడినని చెప్పుకొచ్చాడు.
తాను మొట్టమొదటిగా నటించింది మాతృదేవత అనే తెలుగు సీరియల్ లో అని ఈ సీరియల్ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ అయినటువంటి ఈటీవీ లో ప్రసారమయ్యే అని, ఆ తరువాత సినిమాల్లో నటించానని కానీ తను నటించిన సినిమాల్లో మొట్టమొదటిగా విడుదలైన టువంటి చిత్రం పంచతంత్రం అని ఆ చిత్రం ఇప్పటికీ తనకు స్పెషల్ అని మాస్టర్ భరత్ తెలిపాడు.
అయితే ప్రస్తుతం భరత్ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపాడు.అంతేగాక ఇటీవల కాలంలో ఏబిసిడి చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అయితే ఈ మధ్య కాలంలో ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు వార్తలపై కూడా భరత్ స్పందించాడు.తాను ప్రస్తుతం ఏ చిత్రంలోనూ హీరోగా నటించడం లేదని అంతేగాక నటనలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకా చాలానే ఉన్నాయని అన్నారు.