ఈ స్టార్ హీరోయిన్స్ సొమ్ములెక్కడ పెడుతున్నారో తెలుసా?
టాలీవుడ్ నుంచి అన్ని భాషల్లో దుమ్ముదులిపేస్తున్న ముద్దుగుమ్మలు భారీ రెమ్యునరేషన్స్ అందుకుంటూ హీరోలకు ధీటుగా ఉంటున్నారు. దాశబ్ధం పైగా పరిశ్రమలో రాణిస్తున్న హీరోయిన్స్ సంపాదన చూస్తే, నయనతార 5నుంచి ఆరుకోట్ల,అనుష్క 3కోట్లు,కాజల్ – త్రిష లాంటి వాలు కోటిన్నర నుంచి 2కోట్లు చొప్పున ఒక్కో సినిమాకు అందుకుంటున్నారు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ బానే కూడబెట్టారు. దీనికితోడు యాడ్స్ ద్వారా కూడా సొమ్ములు కూడబెడుతున్నారు.
మరి ఇంతలా సంపాదించే సొమ్ము ఎక్కడ పెడుతున్నారో, ఏమిచేస్తున్నారో అనే అనుమానం రాక మానదు. ఓవైపు సంపాదన చేస్తూనే, మరోవైపు భవిష్యత్తు ఆదాయం మార్గాలకు బాటలు వేసుకుంటున్నారట. అనుష్క ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు వేరే రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కాజల్ లాంటి వాళ్ళు ముంబైలో పెట్టుబడులు పెడుతున్నారు. నయనతార, త్రిష,శ్రేయ తదితర హీరోయిన్స్ తమకు నమ్మకస్తుల చేత చిన్న సినిమాలకు పెట్టుబడులు పెట్టిస్తున్నారట. అనధికార నిర్మాతలుగా కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారని అంటున్నారు. తమన్నా కూడా భూములు,రియల్ ఎస్టేట్స్ కాకుండా సినిమాలపైనే పెట్టుబడులు పెడుతోందట.
చిన్న సినిమాలకు కథ నచ్చి, బానే ఉంటుందన్న నమ్మకం కుదిరాక ఈ భామలు పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఓ అగ్ర నిర్మాణ సంస్థలో ఈ భామలు పెట్టుబడులు పెట్టినట్లు టాక్. మరి ఆ బ్యానర్ ఏమిటి,ఆ బడా నిర్మాత ఎవరు అనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే సినిమాల ద్వారా సంపాదించిన సొమ్ముని నమ్మకస్తుల ద్వారా సినిమాలకే పెట్టుబడి పెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సినిమా లో పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలంగా షేర్స్,కొన్ని ఏరియా హక్కుల ను పొందడం ఇలా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారట.