Movies

ఎన్టీఆర్ నెంబర్ 1 కాకపోవడానికి కారణాలు.. చేసిన మిస్టేక్స్

తెలుగు చిత్రసీమలో ఎగిసిపడ్డ కెరటంలా జూనియర్ ఎన్టీఆర్ దూసుకొచ్చాడు. రెండు పదుల వయసులో ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే రెండు బ్లాక్ బస్టర్స్ అందుకుని అప్పటికే ఇండస్ట్రీలోని స్టార్ హీరోల రికార్డ్స్ క్రాస్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ వన్ పొజిషన్ కి పోటీగా నిలిచాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాతే అతడికి డౌన్ ఫాల్ మొదలైంది. సింహాద్రి నుంచి యమదొంగ దాకా సరైన హిట్ లేకుండా పోయింది. తర్వాత మళ్ళీ ప్లాప్స్ చుట్టుముట్టాయి. సక్సెస్ లో ఉన్నప్పుడు ఏర్పడిన కోటరీ వలన దారుణంగా దెబ్బతిన్నాడు. రెచ్చగొట్టేలా గైడెన్స్ ఇవ్వడం వలన యాంటీ ఫాన్స్ భారీగా తయారయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉన్నాసరే, ఎన్నికల సమయంలో తారక్ పేరు రావడం మైనస్ అయింది.

ఇక గత నాలుగేళ్లుగా హిట్స్ వస్తున్నా సరే, బ్లాక్ బస్టర్ అవ్వడం లేదు. తారక్ సినిమా రిలీజ్ అయిందంటే ఓపెనింగ్స్ చూడక్కర్లేదు. అదిరిపోయే ఓపెనింగ్స్ ఉన్నా సరే, తన స్టామినాకు తగిన హిట్ మాత్రం సింహాద్రి తర్వాత రాలేదనే చెప్పాలి. మన స్టార్ హీరోలను ఎవరిని చూసిన 25,30సంవత్సరాల మధ్యలో వారికే స్టార్ డమ్ వచ్చింది. కానీ తారక్ కి 19ఏళ్ళవయస్సులోనే ఆ రేంజ్ వచ్చేసింది. 20ఏళ్ళు కష్టపడితేనే గానీ రాని ఇమేజ్, ఆది, సింహాద్రి లాంటి హిట్స్ తో రెండు సినిమాలతోనే వచ్చేసింది. పార్టీ ముద్ర కూడా ఎదుగుదలకు ఇబ్బంది అవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ తన నెంబర్ వన్ స్థానం వదులుకున్నాకే రాజకీయాల్లోకి వస్తే, జూనియర్ అందుకు భిన్నంగా చేసి దెబ్బతిన్నాడు.

వయసుకి మించిన స్టార్ డమ్ రావడంతో అతడు మోయలేకపోయాడు. అందుకే సింహాద్రి తర్వాత సినిమాలు ప్లాప్ కావడమే అందుకు నిదర్శనంగా నిలిచాయి. పైగా హిట్ మూవీస్ తరువాత కథ, స్క్రిప్ట్ విషయంలో వేసిన తప్పటడుగులు దెబ్బతీశాయి. ఇమేజ్ నిలబెట్టుకునేలా సాంబ, సరసింహుడు లాంటి మూవీస్ చేసాడు. హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ మూవీ చేసి,రాంగ్ స్టెప్ వేసాడు. ఇక వయసుకి తగ్గ క్యారెక్టర్స్ కాకుండా బరువైన పాత్రలతో దెబ్బతిన్నాడు. ఇక ఆర్య, భద్ర,అతనొక్కడే,బొమ్మరిల్లు,కిక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేజేతులా పాడుచేసుకున్నాడు. సింహాద్రి తర్వాత ఆర్య ,భద్ర మూవీస్ చేసివుంటే ఎన్టీఆర్ స్థాయి ఊహించగలమా ?కానీ వదులుకున్నాడు. మాస్ బేస్ కి ఇచ్చిన ప్రయాట్రీ క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో ఇవ్వలేకపోయాడు.