బిగ్ బాస్ 3 లో పార్టిసిపెంట్స్ ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా?
తెలుగు స్మాల్ స్క్రీన్ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రసారం అయ్యి అదే అతి తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న షో ఏదన్న ఉంది అంటే అది ఖచ్చితంగా బిగ్గెస్ట్ రియాలిటీ షో “బిగ్ బాస్” అని చెప్పాలి.ఇప్పటికే మూడు సీజన్లను ఈ షో పూర్తి చేసుకుంది.అయితే ఈ మూడు సీజన్లు కూడా రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్ ను నెలకొల్పాయి.కానీ మూడో సీజన్ మాత్రమే దేశ వ్యాప్తంగా అతి పెద్ద టీఆర్పీ రేటింగ్ ను రాబట్టుకుంది.దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.ముఖ్యంగా ఈ సీజన్లోని కంటెస్టెంట్స్ తెలుగు వీక్షకులకు కాస్త పరిచయం ఉన్నవారే ఎక్కువ అలా ఈ సీజన్ కు వీక్షకుల శాతం పెరిగింది.
దీనితో ఫైనల్స్ వరకు మంచి రసవత్తరంగా ఈ షో సాగింది.కానీ అసలు ఈ షో తర్వాత మాత్రం చాలా మంది ఎటు వెళ్లిపోయారో కూడా తెలీదు.కొంతమంది అయితే అదే హోరు కొనసాగిస్తున్నారు.టైటిల్ విన్నర్ రాహుల్,రన్నర్ శ్రీముఖిలు వారు వారి వృత్తులలో బిజీ బిజీగా లైఫ్ గడుపుతున్నారు.వీరితో పాటు యాంకర్స్ జాఫర్ మరియు సావిత్రిలు కూడా యథావిధిగా న్యూస్ ఛానెల్స్ లో కనిపిస్తుండగా బాబా అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే తన పనుల్లో పడిపోయారు.కానీ ముఖ్యంగా అయితే బయటకు కనిపిస్తూ అదే హోరు జోరు కొనసాగిస్తోంది మాత్రం శ్రీముఖి మరియు రాహుల్ లే అని చెప్పాలి.