Health

పెరుగు తింటే..మహిళలకు లాభాలు

మహిళలు రోజూ పెరుగు తింటుంన్నారా.. అయితే ఇదీ మీరు చదవాల్సిందే.. పెరుగు తింటే.. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము కేన్సర్‌ ముప్పు తగ్గుతుందని బ్రిటన్‌లోని ల్యాన్‌కాస్టర్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పాలలోని ల్యాక్టోజ్‌ను పులియబెట్టే బ్యాక్టీరియా బాలింత మహిళల రొమ్ము నాళాల్లో పేరుకుపోయి దీర్ఘకాలంలో కేన్సర్‌కు దారి తీస్తుందని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదంటే రోజూ పెరుగు తినాలని వారు చెప్పారు. పెరుగులోనూ ల్యాక్టోజ్‌ను పులియబెట్టే తరహా బ్యాక్టీరియానే ఉంటుందని.. అది రొమ్ము నాళాల్లోని హానికారక బ్యాక్టీరియాను తొలగించి దాని స్థానాన్ని భర్తీ చేస్తుందన్నారు. ఫలితంగా కేన్సర్‌ ముప్పు తప్పుతుందని వివరించారు.