Movies

మళ్ళీ జబర్దస్త్ కి నాగబాబు…దీనిలో నిజం ఎంత?

కామెడీ ఒకరి సొత్తు కాదంటూ జబర్దస్త్ వదిలేసి జి తెలుగు అదిరింది షోకి వెళ్లిన మెగా బ్రదర్ నాగబాబుకి కాలం కలిసిరాలేదు. రాజకీయాల్లో చేరి నరసాపురం నుంచి పోటీ చేసిన నాగబాబుకు ఓటమి తప్పలేదు. ఇక బుల్లితెరమీద కూడా తేడా కొట్టేసింది. జబర్దస్త్ 7. 26రేటింగ్ తో దూసుకుపోతుంటే, అదిరింది షో కి 3. 30రేటింగ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కాన్సెప్ట్ పరంగా చూసినా అదిరింది షో వీక్ గానే ఉందన్న టాక్ వచ్చేసింది. దీంతో జబర్దస్త్ కి నాగబాబు రీ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం జోరందుకుంది. అయితే నాగబాబు రియాక్షన్ ఎలా ఉందొ ఇంకా తెలియరాలేదు. పైగా నాగబాబు,రోజా కాంబినేషన్ జబర్దస్త్ లో అదిరిపోయేలా ఉంటుంది. గెటప్ శ్రీను,సుడిగాలి సుధీర్,ఆటో రామ్ ప్రసాద్,హీరోలుగా నటిస్తున్న త్రీ మంకీస్ ట్రైలర్ ని ఆదివారం విడుదల చేసారు. ఈసందర్బంగా గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్ చేసాడు.

డప్స్ మాస్టర్ చిత్రంలో కూడా కీలక భూమిక పోషిస్తున్న గెటప్ శ్రీను మాట్లాడుతూ నాగబాబు రీ ఎంట్రీ జబర్దస్త్ లో త్వరలోనే అని షాకింగ్ కామెంట్స్ చేసాడు. ‘జబర్దస్త్,అదిరింది షో వేరు వేరు ప్లేట్ ఫార్మ్స్ మీద నడుస్తున్నా ,వీటిలో నటించేవాళ్లమంతా ఒకే కుటుంబంగా ఉన్నాం. మాలో ఎలాంటి విబేధాలు లేవు. అయితే నాగబాబు తిరిగి వస్తే, మాకు ఎనర్జీ పెరుగుతుంది’అని పేర్కొన్నాడు.