Politics

ఎన్టీఆర్ గురించి నమ్మలేని నిజాలు చెప్పిన లక్ష్మి పార్వతి

సినిమాల్లో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ,రాజకీయాల్లో సంచలనంగా మిగిలిన నందమూరి తారకరామారావు జీవితంలోకి లక్ష్మిపార్వతి ప్రవేశం ఓ గొప్ప మలుపు. అంతకు మించి ఓ పెద్ద వివాదం. ఓ సంచలనం. ఆయన జీవిత చరిత్ర రాస్తానని ఎంట్రీ ఇచ్చి పెళ్ళిచేసుకునే దాకా నడిచింది. ‘ఆయన చూసినా చాలు ,ఆయన ఎదురుగా ఉన్నా చాలు .. చివరకు ఆయనను తల్చుకుని బతికినవాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వ్యక్తికి దగ్గరగా మసులుతూ సేవచేయడం, భార్య స్థానం పొందే అదృష్టం దక్కడం కన్నా నాకేముంటుంది’అని లక్ష్మిపార్వతి పలు ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.

మమతానురాగాలు చూసే సమయంలో వయస్సు అన్నీ చూస్తారా అంటే అలాంటిది ఎప్పుడూ అన్పించలేదని లక్ష్మీపార్వతి ఓ ఛానల్ ఇంటర్యూలో చెప్పారు. మా ఇద్దరి జంట ఫోటోలు చూస్తే ఎక్కడా వయసు తేడా కనిపించదని ఆమె చెప్పుకొచ్చారు. మా తల్లి చిన్నపుడు నుంచి ఎన్టీఆర్ ఫోటో చూపించి దైవంగా చెప్పేదని,చిన్ననాటి నుంచి ఎన్టీఆర్ ఫోటో చూసి దణ్ణం పెట్టుకునే అలవాటు అయిందని చెప్పారు. నిజానికి మా ఇద్దరి రహస్య జీవితంఏడాదిలోనే బాగా సంతోషంగా గడిపామని ఆమె నవ్వుతూ చెప్పారు. మా ఇద్దరి మధ్యా ప్రేమ వర్ణించలేనిదని ఆమె అన్నారు.

ఎన్టీఆర్ నా పట్ల చూపిన ప్రేమను ఎప్పటికీ మరువలేనిదని,ఆయన జ్ఞాపకాల్లోనే బతుకుతున్నానని లక్ష్మీపార్వతి అన్నారు. మమత, ఆప్యాయత,పరస్పర అనురాగం వంటి పదాలు తప్ప లవ్ అనే పదం మనకు లేదని, అన్నారు. ఇంగ్లీషు వారివలన ఈ పదం వచ్చిందన్నారు. తాజాగా రాస్తున్న నవలలో కూడా దీనిగురించి ప్రస్తావన చేశానన్నారు. అయితే నామీద లేనిపోనివన్నీ రాయించి ఆయన అధికారం పోయేదాకా వదల్లేదనిఆమె విచారం వ్యక్తంచేశారు. ఇవన్నీ బాధ కల్గి,ఓసారి ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే కూడా కలవలేదని, అయితే కలవమని ఎన్టీఆర్ చెప్పడంతో మొండికేశానని చెప్పారు. దాంతో వీపు మీద గట్టిగా ఓ దెబ్బ వేశారని,దాంతో తలుపు దగ్గర పడ్డానని ఆమె చెబుతూ ఆ దెబ్బను ఇప్పటికీ మర్చిపోలేదని చెప్పారు.