ఎన్టీఆర్ రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడో తెలుసా?
మొన్నటి ఎన్నికల్లో టిడిపి దారుణ పరాజయం తర్వాత టిడిపిలో నైరాశ్యం నెలకొంది. దానికి తోడు మూడు రాజధానులు,మండలి రద్దు ,అమరావతి తరలింపు ఇలా పలు వివాదాస్పద నిర్ణయాలు,వైస్సార్ సిపి ప్రవేశపెడ్తున్న పధకాలు ఇవన్నీ చూస్తుంటే టిడిపికి కొరకరాని కొయ్యగా మారాయి. ఎంత పోరాటం చేస్తున్నా కలిసిరావడంలేదు. ఇలాంటి సమయంలో టిడిపిని నిలబెట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. లోకేష్ కంటే తారక్ బెటరన్న మాటలు వస్తున్నాయి.
దీనికి కారణం 2009ఎన్నికల్లో టిడిపి తరపున జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రచారం వలన టిడిపికి బాగానే కలసివచ్చింది. అయితే పార్టీ అధికారంలోకి మాత్రం రాలేదు. ఆతర్వాత జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నాడు. కావాలనే లోకేష్ కోసం తారక్ ని తొక్కేశారని టాక్ కూడా నడిచింది. ఇప్పటికీ అదే భావన ఉంది. ఇదే విషయాన్నీ ఓ ఛానల్ ప్రతినిధి టిడిపి సీనియర్ నేత కంభంపాటి రామమోహనరావు దగ్గర ప్రస్తావించగా,ఆయన షాకింగ్ కామెంట్స్ చేసారు.
ఒకరిని ఒకరు తొక్కేయడం, ఒకరిని మరొకరు లేపడం లాంటివి రాజకీయాల్లో ఉండవని కంభంపాటి స్పష్టం చేసారు. స్వతహాగా టాలెంట్ ఉండాలన్నారు. ఒక నాయకుడికి చంద్రబాబు పదవి ఇచ్చినంత మాత్రాన అతడు నిలబెట్టుకోలేకపోతే నాయకుడిగా నిలబడలేడని ఆయన అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే, ఎన్టీఆర్ మనవడిగా సినీ స్టార్ గా ఎంతో భవిష్యత్తు ఉందని అన్నారు. ప్రస్తుతం సినిమాలపై దృష్టిపెట్టాడని,ఒకవేళ రాజకీయాల్లోకి వస్తానని అంటే చంద్రబాబు ఆహ్వానిస్తారనే అనుకుంటున్నానని కంభంపాటి అభిప్రాయపడ్డారు. పైగా సంబంధాలు కూడా బయట అనుకునే విధంగా నెగెటివ్ గా కాకుండా పాజిటివ్ గానే ఉంటాయని అన్నారు.