పవన్ సినిమాకు అంత సీన్ ఉంటుందా..? అన్ని కోట్లు వర్క్ అవుట్ అవుతుందా…?
ప్రముఖ సినీ హీరో మరియు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి మళ్ళీ సినిమాలు మొదలు పెట్టారు.తన ఆర్ధిక పరిస్థితుల రీత్యా ఇప్పుడు ఓ రెండు సినిమాలను ఒప్పుకున్నారు.అయితే వీటిలో ఒకటి సాదా సీదా సినిమాయే అయినా కంటెంట్ పరంగా గట్టిది అలాగే మరో చిత్రం ఒక పక్క కంటెంట్ మరోపక్క భారీ బడ్జెట్ తో కూడుకున్నది అని తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం పవన్ “పింక్” రీమేక్ లో నటిస్తుండగా ఈరోజే టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక పీరియాడిక్ డ్రామా చిత్రం ముహూర్తం జరుపుకుంది.అయితే ఈ చిత్రంపై ఇప్పుడు చాలా రకాల వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది అని పాన్ ఇండియన్ సినిమాగా రాబోతుంది అని చాలానే వినిపిస్తున్నాయి.అయితే ఒక పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించినట్టైతే ఈ చిత్రం ఎంత వరకు రాబడుతుంది అన్నది ప్రశ్న.
పవన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే.కానీ అది దక్షిణాది సినిమా వరకు మాత్రమే ఓవరాల్ ఇండియాలో మాత్రం పవన్ కు అంత సీన్ లేదు.మళ్ళీ ఓవర్సీస్ మార్కెట్ కూడా గట్టిగా ఉంది.మన దగ్గర మాత్రం ఒక్క హిందీలో సరిగ్గా చూసుకొని ఏమాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా చాలా రికార్డులు బద్దలవ్వడం ఖాయం అని చెప్పాలి.మరి ఈ చిత్రానికి నిజంగా అంత సీన్ ఉందో లేదో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.