స్టార్స్ తో హిట్ కొట్టిన కూడా అవకాశాలు లేక తెరమరుగు అవుతున్న హీరోయిన్స్
సినిమా రంగంలో ఆటుపోట్లు తప్పనిసరిగా ఉంటాయి. ఒక్కోసారి నిలబడతారు,మరోసారి ఘోరంగా పడిపోతారు. అయితే హిట్ కొట్టినప్పటికీ నిలబడలేకపోయారు కొందరు. ఇక మరికొందరు అయితే ఆతర్వాత పడిపోయాక ఇక కనిపించకుండా పోయిన హీరోయిన్స్ ఉన్నారు. అందులో ప్రధానంగా నేహా శర్మను తీసుకోవాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చిరుత మూవీ చేసిన ఈమె ఆతర్వాత ఎందుకో గానీ కనిపించలేదు. ప్రయాణం మూవీతో పరిచయమైన పాయల్ గోష్ అందం ,అభినయం ఉన్నా సరే, ఎందుకో ఈమె కెరీర్ ఆగిపోయింది.
ఆర్య మూవీతో నేచురల్ బ్యూటీగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అనురాధా మెహతా ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. గ్లామర్ పెంచినా సరే ఫలితం దక్కలేదు. సారా జాండిస్ భామ పంజా మూవీతో ఎంట్రీ ఇచ్చి,ఎక్కువకాలం నిలవలేకపోయింది. ఇక బన్నీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన గౌరీ ముంజల్ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టలేక చతికిలబడిపోయింది. శరణ్య విలేజ్ లో వినాయకుడు మూవీతో క్యూట్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చి ఆతర్వాత భీమిలి కబడ్డీ జట్టులో చేసినా తర్వాత కనిపించలేదు. యూత్ ని బంగారం మూవీతో ఎట్రాక్ట్ చేసిన మీరా చోప్రా స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్లిక్ కాలేదు.
వరుడు సినిమాతో వచ్చిన భాను మెహరా ఆ సినిమా డిజాస్టర్ తో ఆమె కెరీర్ ని దెబ్బకొట్టాయి. ఆమె నటన బాగున్నా కోలుకోలేదు. నాగచైతన్య హీరోగా వచ్చిన సాహసమే శ్వాసగా సాగిపో మూవీతో మంజిమా మోహన్ తెరంగేట్రం చేసింది. అయితే తెలుగులో క్లిక్ కాలేదు. నేహా బామ్ దిల్ మూవీతో సక్సెస్ కొట్టినా స్టార్ హీరోలతో ఛాన్స్ రాకపోవడంతో చతికిలబడింది. కొత్త బంగారులోకం మూవీతో ఎంట్రీ ఇచ్చిన శ్వేతాబసు ప్రసాద్ మంచి అందం ఉన్నా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ పొందలేకపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కల్సి తీన్ మార్ మూవీలో నటించిన కృతి కర్బందా డిజాస్టర్ కొట్టడమే కాకుండా ఒంగోలు గిత్త మూవీతో మరో డిజాస్టర్ అందుకుని చతికిలబడింది.