Movies

ఎన్టీఆర్ డబ్బు పిచ్చి ..టవల్స్ సబ్బులతో సహా మింగేసాడా…?

సినిమా షూటింగ్ సమయంలో డబ్బు కోసం ఎన్టీఆర్ ఏడిపించేవారని, మధ్యలో రెమ్యునరేషన్ పెంచేసేవారని,టవల్స్ ,సబ్బులు కూడా పట్టుకుపోయేవారని, పిసినారి అని, నిర్మాతల చేత హోటల్ బిల్లులు కట్టించారని, ఇలా రకరకాల రూమర్స్ ఉన్నాయి. అయితే ఈ విషయాలపై నిర్మాతలెవ్వరూ పిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ కాంప్లిమెంట్స్ గా భావించి తీసుకుని ఉండవచ్చన్న మాటా వినిపించేది. అయితే డబ్బు విలువ బాగా తెల్సిన వ్యక్తిగా అందరూ చెబుతారు. అప్పు ఇవ్వడం వంటివి అసలు చేసేవారు కాదట. డబ్బు కోసం ఏడిపించినట్లు చెప్పకపోయినా, ఇస్తానన్న డబ్బు తర్వాత సినిమాలో చూసుకుందాంలే అనే ఔదార్యం కూడా ఎన్టీఆర్ కి లేదట.

పైగా తర్వాత సినిమాకు బుక్ చేసుకోవడాన్ని బట్టి నిర్మాతలకు,ఆయనకు ఉన్న అనుబంధం కూడా చాటిచెబుతోంది. కూతురు పెళ్ళికి హోటల్స్ రూమ్స్ బుక్ చేయించినట్లు ఆత్మకథలో రాసిన నిర్మాత ఎం ఎస్ రెడ్డి నిజానికి ఎన్టీఆర్ బతికుండగా ఆమాట చెప్పలేదు. ఇక నిర్మాతగా ఎన్టీఆర్ వ్యవహరించినపుడు బడ్జెట్ మించి పోకుండా జాగ్రత్త పడ్డారు తప్ప,ఎవరికీ పారితోషికం ఎగ్గొట్టినట్లు ఎవరూ చెప్పలేదు. రిహార్సల్స్ కి రావాలని నటులకు చెప్పడమే కాదు తక్కువ పారితోషికం ఇచ్చేవారట. సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవట. అయినా సరే ఎన్టీఆర్ పిలిస్తే పరుగెత్తుకుంటూ వచ్చి వేషాలు వేసేవారట.

ఇక 1949ప్రాంతంలో ఎన్టీఆర్ కి వెయ్యి రూపాయల జీతం అయితే ఖర్చు 100మాత్రమే. కానీ గుమ్మడి 200సంపాదిస్తే 400ఖర్చు అయ్యేది. ఇది చూసి, ఆదాయాన్ని బట్టి ఖర్చు ఉండాలి అని ఎన్టీఆర్ చెప్పేవారట. ఈ విషయాన్నీ గుమ్మడి ఆత్మకథలో రాసుకున్నారు. అలాగే ఒకేసారి కాంతారావు సినిమా షూటింగ్ లో ఉండగా ఇంటినుంచి తల్లికి బాగోలేదని ఫోన్ రావడంతో 500కావాలని నిర్మాతను అడిగితె సినిమా అయ్యాకే ఇస్తానని అన్నారట. ఎంత ప్రాధేయ పడినా లాభం లేకపోయింది. ఇదంతా పక్క రూమ్ లో వింటున్న ఎన్టీఆర్ చెవిన పడింది. వెంటనే కాంతారావు ని ఇంటికి తీసుకెళ్లి ,500ఇచ్చారట. తల్లిని చూసి రమ్మని,వచ్చాక తన డబ్బు తనకు ఇచ్చేయాలని అన్నారట. ఇది ఎన్టీఆర్ ని అభిమానించే కాంతారావు ఆత్మకథలో రాసుకున్నారు.