Movies

మొదటి సినిమాకి ఈ టాలీవుడ్ హీరోయిన్ల వయసు ఎంతో తెలిస్తే ఖచ్చితంగా నోరెళ్లబెడుతారు!!

చిన్ననాటినుంచి నటిస్తూ సడన్ గా హీరోయిన్స్ అయితే వారి వయస్సు తెలిసిపోతుంది. కానీ, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉన్నట్టుండి సినిమాల్లో హీరోయిన్ గా వచ్చి, వెండితెరను ఏలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి వయస్సు తెలిస్తే ఆశ్చర్యపోతాం. అవును వారి వయస్సు 13నుంచి 16ఏళ్ళు కావడమే విశేషం. ఎందుకంటే చూడ్డానికి 20ఏళ్ళు పైనే ఉంటాయని అనుకుంటాం. బొబ్బిలి రాజా మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ దివ్యభారతి కి అప్పట్లో 16ఏళ్ళు . ఆమె నటనతో అందరిని కట్టిపడేసిన ఈ భామ ఇండస్ట్రీని షేక్ చేసింది.

స్టార్ హీరోలందరి సరసన నటించడమే కాదు, మెగాస్టార్ చిరంజీవి కి జోడీగా స్టెప్పులేసి రంభ గురించి ఆలోచిస్తే,ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె వయస్సు అప్పటికి 16ఏళ్ళు మాత్రమే. కానీ సినిమాలో ఎక్కడా ఫిజికల్ గా ఈ భామ అలా కనిపించదు. తొలిసినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన హన్సిక వరుస ఛాన్స్ లతో దూసుకెళ్లింది. అయితే ఆమె నటించిన తొలిసినిమా దేశముదురు సమయానికి ఆమె వయస్సు16ఏళ్ళు.

టాలీవుడ్ లో మిల్కి బ్యూటీగా పిలిచే తమన్నా మెగాస్టార్ సరసన సైతం స్టెప్పులేసి అదరగొట్టింది. హ్యాపీడేస్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈమె హిందీలో తొలిసినిమా శ్రీ లో నటించింది. ఆ సమయానికి ఆమె వయస్సు 15ఏళ్ళు . పంజాబీ భామ ఛార్మి తెలుగు లోనే కాదు,బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో చేసింది. నీతోడు కావాలి మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు అప్పుడు 15ఏళ్ళు మాత్రమే. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ దొరకడం,ఎన్నో సినిమాల్లో తన నటనతో అదరగొట్టడం జరిగాయి. ప్రస్తుతం ఛార్మి సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది.