చిట్టితల్లి లో సీరియల్ లో నటించే ఈ పాప గురించి మీకు తెలియని విషయాలు
బుల్లి తెరపై సీరియల్స్ హవా నడుస్తోంది. ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో కొన్ని సీరియల్స్ ఏళ్లతరబడి ఆదరణతో నడుస్తున్నాయి. ఈ సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్టులు కూడా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా కథలో రాజకుమారి సీరియల్ ముగియడంతో ఆ ప్లేస్ లో చిట్టితల్లి ప్రసారం అవుతోంది. ఈ సీరియల్ లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆహానా అందరిని ఆకట్టుకుంటోంది.
టైటిల్ రోల్ తో అద్భుత నటనతో ఆకట్టుకుంటున్న ఆహానా బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఓసారి చూద్దాం. జనవరి 24న హైదరాబాద్ లో జన్మించిన ఆహానా అసలు పేరు ఆహానా బర్ఫీ. ఈమెకు ఓ తమ్ముడున్నాడు. యాక్టింగ్ అంటే ఇష్టం గల ఈమె టిక్ టాక్ వీడియోస్ తో ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం పాటలు,డాన్స్ నేర్చుకుంటున్న ఆహానా తన నటనలో స్కిల్స్ ని వృద్ధి చేసుకుంటోంది. మరిన్ని సీరియల్స్ లో ఆమెకు ఆఫర్స్ కూడా వస్తున్నాయట.ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈమె వంశీ కృష్ణ తీసిన ఒక సినిమాలో కూడా నటించింది.