హీరో రంగ నాధ్ నిర్ణయమే కొంప ముంచిందా…?
సినిమా రంగంలో నటీ నటులు తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి మంచి ఫలితాన్ని ఇస్తాయి. తేడా వస్తే కుప్పకూల్చేస్తాయి. నటుడు రంగనాధ్ విషయంలో ఇదే జరిగింది. 1949లో మద్రాసులో జన్మించిన రంగనాధ్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బిఎ డిగ్రీ తీసుకున్నారు. ఇండియన్ రైల్వే లో టికెట్ కలెక్టర్ గా పనిచేసిన ఈయన థియేటర్ ఆర్ట్స్ లో నటనలో శిక్షణ తీసుకున్నారు. అక్కినేని నటించిన బుద్ధిమంతుడు మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నటుడు గిరిబాబు ఎంకరేజ్ మెంట్ తో చందన మూవీలో హీరోగా నటించారు. శ్రీ వాసవీమాత చరిత్ర మూవీలో ఆయన నటించిన ఆఖరి చిత్రం.
దేవతలారా దీవించండి,జమీందారుగారి అమ్మాయి,పంతులమ్మ,ఇంటింటి రామాయణం,అమెరికా అమ్మాయి,అందమే ఆనందం,వేట ,ముగ్గురు మొనగాళ్లు,దొంగమొగుడు,బృందావనం,కలిసుందాం రా, మన్మధుడు,నిజం లాంటి సినిమాల్లో హీరోగా, విలన్ గా, అన్నగా, ,తండ్రిగా, ఇలా పలు కేరక్టర్ ఆర్టిస్టుగా చేసి,మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయనకు ఒక కుమారుడు ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సీరియల్స్ లో నటించిన రంగనాధ్ దర్శకుడిగా మారి,హీరో శివాజీ హీరోగా వచ్చిన మొగుడ్స్ పెళ్లామ్స్ అనే సినిమాకు డైరెక్షన్ చేసారు.
ఈయన భార్య తిరుమల చైతన్య 2009లో అనారోగ్యంతో కన్నుమూసింది. ఈమెతో ఎంతో అన్యోన్యంగా ఉండే రంగనాధ్ భార్య మరణంతో కుంగిపోయారు. నిజానికి ప్రమాదవశాత్తూ ఆమె కిందపడిపోవడంతో మంచానికే పరిమితం అయిన ఆమెను నాలుగేళ్లు కంటికి రెప్పలా చూసుకున్నారు. కొడుకు,కూతుళ్ళకు పెళ్లిళ్లు అయిపోవడతో ప్లేట్ అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉన్నారు. ఆవేదనతోనే ఒకసారి రైలు కిందపడి మరణించాలని అనుకున్నట్టు రంగనాధ్ స్వయంగా ఓ ఇంటర్యూలో చెప్పారు. ఆయన కూతురు స్పెషల్ గా కౌన్సిలింగ్ ఇచ్చినా సరే,ఆయనలో మార్పురాలేదు. 2015డిసెంబర్ 19న తన అపార్ట్ మెంట్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.