Movies

హైపర్ అదికి, మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్…

అసలు వివాదంలోంచి వినోదం వెతుక్కోవడమే హైపర్ ఆది స్టైల్. ఎప్పటికప్పుడు సెన్సేషనల్ స్కిట్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు ఈ కుర్ర కమెడియన్. అయితే మెగా హీరోలకు భక్తుడిగా ఉండే ఆదిపై ఇప్పుడు వాళ్లే మండిపడుతున్నారు.మెగా ఫ్యాన్స్ కోపానికి కారణం అవుతున్నాడు ఆది. దానికి కూడా ప్రత్యేకంగా కారణాలు లేకపోలేవు. ఈ మధ్య ఓ స్కిట్‌లో భాగంగా నాగబాబుపైనే సెటైర్లు వేసాడు ఈయన. జబర్దస్త్ షోలో నాగబాబు ఉన్నన్ని రోజులు ఆయనకు వీర విధేయుడిగా ఉన్నాడు ఆది. కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత మాత్రం రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం నాగబాబు హోస్ట్ చేస్తున్న అదిరింది షో పైనే సెన్సేషనల్ సెటైర్స్ వేసాడు. ఓ స్కిట్‌లో భాగంగా.. నన్ను, అనసూయను, రోజా గారిని తీసుకెళ్లి కుదిరింది అనే షో పెట్టుకోరా అంటూ మరో కమెడియన్ రాజుపై సెటైర్ వేసాడు ఆది.

అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఊసరవెల్లిలా మారిపోయావ్ ఆది నువ్వంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్.పైగా అది కాకుండా మనోడు ప్రతీ స్కిట్‌లో కూడా చిరంజీవి లేదంటే మెగా హీరోల పాటలతో ఎంట్రీ ఇస్తుంటాడు. ఇప్పుడు ఏకంగా ఆ గెటప్స్‌తోనే వస్తున్నాడు. మొన్నామధ్య గబ్బర్ సింగ్.. ఆ తర్వాత గద్దలకొండ గణేష్.. తర్వాత సైరా నరసింహా రెడ్డి.. మొన్నామధ్య అల వైకుంఠపురములో.. ఇలా కొత్త సినిమా విడుదలైతే చాలు అందులోకి దూరిపోతున్నాడు ఆది.

ఇదే ఇప్పుడు అభిమానులకు కోపం తెప్పిస్తుంది. సూట్ కాకపోయినా కామెడీ కోసం అలాంటి గొప్ప కారెక్టర్స్ తీసుకుని కామెడీ చేస్తున్నాడంటూ ఆదిపై మండిపడుతున్నారు ఫ్యాన్స్.దయచేసి అలాంటి ఓవర్ యాక్షన్ చేయకు ఆది అంటూ సోషల్ మీడియాలో మనోడికి చాలా మర్యాదగా చెప్తున్నారు.. కొందరు అయితే కాస్త ఘాటుగానే వార్నింగులు కూడా ఇస్తున్నారు. మెగా అభిమాని అయినా కూడా అలాంటి గెటప్స్‌లో కనిపిస్తే అసలు సహించలేం అంటున్నారు వాళ్లు. అన్నింటికి మించి ఆ మధ్య చిరంజీవి ఉయ్యాలవాడ గెటప్‌ను స్పూఫ్ చేసాడు ఆది.

అందులోనే మగధీర, బాహుబలి సినిమాలను కూడా కలిపేసాడు.అసలే నాగబాబుపై సెటైర్లు.. పై నుంచి మళ్లీ తెలుగు ఇండస్ట్రీ ప్రైడ్‌గా భావించే సినిమాలను అలా నీ కామెడీ కోసం కంగాళీ చేస్తావా అంటూ మనోడితో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. దీనిపై హైపర్ ఆది మాత్రం లైట్ తీసుకుంటున్నాడు. తానేం చేసినా కూడా కామెడీ కోసమే అని.. నవ్వించడం తన లక్ష్యం అంటున్నాడు ఈ కమెడియన్. గతంలోనూ మనోడు చేసిన కామెడీకి చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ అవేం పట్టించుకోకుండా దూసుకెళ్తున్నాడు ఆది. మరి ఈయన జోరుకు ఎక్కడ బ్రేకులు పడతాయో చూడాలిక.