పవన్ కళ్యాణ్‌కి కోలుకోలేని దెబ్బ.. జనసేనకు కీలకనేత రాజీనామా..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. విశాఖపట్నానికి చెందిన మరో కీలక నేత జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇటీవల ఆ పార్టీలో కీలకంగా ఉన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పార్టీనీ వీడిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో నచ్చక లక్ష్మీ నారాయణ పార్టీనీ వీడుతున్నట్టు చెప్పుకొచ్చారు.
అయితే ఈ షాక్ నుంచి కోలుకోకముందే పవన్‌కి గాజువాకలోని మరో కీలక నేత షాక్ ఇచ్చారు. గాజువాక జనసేన సీనియర్ నాయకుడు కరణం కనకారావు నేడు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరిపోయారు. అయితే కనకరావుతో పాటు దాదాపు వంద మంది జనసైనికులు వైసీపీ కండువా కప్పుకున్నారు.