Sports

కోహ్లీ క్రికెట్ లోకి అడుగు పెట్టాక ఎంత ఆస్థి సంపాదించాడో తెలుసా?

విరాట్ కోహ్లీ అనగానే వరల్డ్ వైడ్ గా క్రికెట్ అభిమానులకు బాగా తెల్సిన వ్యక్తి అని వేరే చెప్పక్కర్లేదు. అవతల టీమ్ లో ఎవరున్నా సరే,సెంచరీలు కొట్టే ఈ బ్యాట్స్ మాన్ కి వ్యక్తిగతంగా కూడా అభిమానులున్నారు. ఎందుకంటే మంచి హృదయం ఉన్నవాడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కారణం. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతోఇష్టం చూపిస్తూ,శ్రద్ధ పెట్టడం వల్లనే ఇప్పుడు నెంబర్ పొజిషన్ కి వచ్చాడు. ప్రిన్స్ ఆఫ్ ది క్రికెట్ గా ఇతడిని వ్యవహరిస్తుంటారు.

క్రికెట్ లో ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్,పాపులార్టీ విరాట్ కోహ్లీ ఎంతోకష్టపడి సాధించుకున్నాడు. వరల్డ్ లో టాప్ 100అథ్లెట్స్ లో విరాట్ 7వ ప్లేస్ లో ఉన్నాడంటే ఇతడి క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ లో ఏ క్రికెటర్ కి లేని క్రేజ్ ఇతడి సొంతం. కష్టపడడంతో పాటు పేద విద్యార్థులకు సాయం చేయడం అతడి నిజమైన ఆస్తిగా చెబుతారు. అతడికి వచ్చే సంపాదనలో దాదాపు 20శాతం పేద విద్యార్థులకు ,అనాధ ఆశ్రమాలకు వెచ్చిస్తాడు.

అయితే విరాట్ కోహ్లీ ఆస్థి ఎంత, ఏడాదికి క్రికెట్ నుంచి ఎంత సంపాదన చేస్తాడు,ఒక్కో మాక్ కి ఎంత దక్కించుకుంటాడు వంటి వివరాల్లోకి వెళ్తే,ఇతడి మొత్తం ఆస్థి 372కోట్లు. ఒక్క ఏడాదికి క్రికెట్ ,యాడ్స్ పరంగా 110కోట్లు సంపాదిస్తాడు. ఢిల్లీలో ఐదు కోట్ల విలువ చేసి ఇల్లు,రెండు సూపర్ లగ్జరీ కార్లు ఉన్నాయి. ఓ చార్టర్ ఫ్లయిట్ కూడా రన్ చేస్తున్నాడు.