ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా… ప్రపంచంలోనే టాప్ కంపెనీలో జాబ్…ఏమిటో చూడండి
ఒకప్పుడు సినిమాల్లో నటిస్తూ మన పక్కింటి అమ్మాయిలా కనిపించే మాన్య నాయుడు అచ్చ తెలుగు అమ్మాయే. అయితే ఇంగ్లాండ్ లో సెటిల్ అయినా డాక్టర్ ప్రహ్లాదన్, పద్మినీలకు ఆమె పుట్టింది. 9ఏళ్ళ వయస్సులో ఇండియాకు వచ్చిన మాన్య తెలుగు చక్కగా మాట్లాడేది. 14ఏళ్ళ ప్రాయంలో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 19998లో హరికృష్ణ,నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సీతారామరాజు మూవీలో చిన్న పాత్రవేసింది. ఆతర్వాత శివాజీ హీరోగా వచ్చిన బ్యాచిలర్స్ మూవీలో హీరోయిన్ గా నటించింది.
మాయదారి మైసమ్మ పాటలో శివాజీ తో కల్సి వేసిన స్టెప్స్ ఇప్పటికీ మన మదిలో మెదులుతాయి. ఆ సినిమాతో హీరోయిన్ గా హిట్ కొట్టడంతో తెలుగు ,తమిళం,కన్నడ,మలయాళం మూవీస్ లో నటించింది. దాదాపు 41సినిమాల్లో చేసిన ఈమె తెలుగులో దేవా, సాహస బాలుడు విచిత్ర కోతి, ఇంగ్లీషు పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు,సాంబయ్య,శివయ్య,బ్రహ్మచారుడు,తమాషా, ఎంతవారలైనా తదితర చిత్రాల్లో చేసింది. హీరోయిన్ , చెల్లిగా సపోర్టింగ్ పాత్రల్లో నటించిన ఈమె కొంతకాలంగా ఇండస్ట్రీ కి దూరమైంది.
సత్య పటేల్ అనే తెలుగు వ్యక్తితో పెళ్లవ్వడంతో 2007తర్వాత మాన్య నాయుడు సినిమాల్లో లేదు. అయితే కొన్నాళ్లకే విడాకులు తీసుకుని స్టడీస్ పై దృష్టి పెట్టింది. కొలొంబియాలో మాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్ మెంట్ లో డిగ్రీ చేస్తుండగా ప్రకాష్ బాజ్ పాయ్ అనే వ్యక్తితో ప్రేమలో రెండో పెళ్లి చేసుకుని అమెరికా షిఫ్ట్ అయింది . అక్కడే ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో అడుగుపెట్టి టాప్ పొజిషన్ లో ఉంది. ఈమెకు నాలుగేళ్ల పాప ఉంది. ఈమె వరల్డ్ లో నెంబర్ వన్ బ్యాంకింగ్ సంస్థ అయిన జెపి మోర్గాన్ ఛేజ్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కి హెడ్ గా వర్క్ చేస్తోంది.