Movies

నాగ చైతన్యకు తల్లి,తండ్రి నుంచి ఎంత ఆస్థి వచ్చిందో తెలుసా?

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య లవ్ స్టోరీస్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ కొట్టేసాడు. జోష్ మూవీతో 2009లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చైతు స్టార్ డమ్,పాపులార్టీ సొంతం చేసుకున్నాడు.

తెలుగు సినిమా ద్వారా ఆడియన్స్ కి ఎదో ఒక కొత్తదనం చూపించడం చైతూ నిజమైన ఆస్తిగా చెబుతారు. అందుకే డిఫరెంట్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. సమంతను పెళ్లి చేసుకున్నాక చైతూతో పాటు సమంత కూడా మరింత బిజీ ఆర్టిస్ట్ అయిపొయింది.

అయితే చైతు ఆస్థి ఎంత, ఏడాదికి ఎంత సంపాదన చేస్తాడు,ఒక్కో సినిమాకు ఎంత దక్కించుకుంటాడు వంటి వివరాల్లోకి వెళ్తే,ఇతడి మొత్తం ఆస్థి 40నుంచి 45కోట్లు. ఒక్క ఏడాదికి 15కోట్లు సంపాదిస్తాడు. ఒక్కో సినిమాకు 3నుంచి 5కోట్ల వరకూ రెమ్యునరేషన్ ఉంటుంది. జూబ్లీ హిల్స్ లో 5 కోట్ల విలువ చేసి ఇల్లు,ఒక సూపర్ లగ్జరీ కారు ఉన్నాయి. బైక్స్ అంటే చాలా ఇష్టపడే చైతు 8సూపర్ లగ్జరీ బైక్స్ ని మెయింటేన్ చేస్తున్నాడు.