నెటిజన్‌కి హీరో రానా క్లాస్.. సోషల్ మీడియాలో వైరల్..!
దగ్గుబాటి రానా హీరోగా, తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘హథీ మేరే సాథీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి రానా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తెలుగులో అరణ్య పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌లో రానా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అయితే ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్రంలో రానా లుక్ చూసి అందరూ బాగుందని ప్రశంసలు అందిస్తుంటే, ఒక వ్యక్తి మాత్రం కాస్త భిన్నంగా కామెంట్స్ చేశాడు.
అయితే ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో నేను పదో తరగతి ఫెయిల్ అయ్యాను అని, కానీ ఆ ఫలితాలు నా కలలు నెరవేర్చుకోకుండా ఆపలేకపోయాయి అని రాణా మాట్లాడిన వీడియోను పోస్ట్ చేస్తూ ఒక కౌంటర్ విసిరాడు. ఎందుకంటే నా కుటుంబానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఉంది అంటూ సెటైర్లు వేశాడు. దీనిపై స్పందించిన రానా అందులో ఏమీ లేదు బ్రో అంటూ మనం నటన అనే ఆర్ట్‌ని నేర్చుకోకపోతే వెనక ఎంత పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నా వేస్టే. ఇండియాలో చాలా స్టూడియోస్ ఉన్నాయి. కానీ ఏం లాభం. టాలెంట్ లేక మూతబడిపోతున్నాయి. నిన్ను ప్రపంచమంతా ఫెయిల్యూర్ అని ఎగతాళి చేసినా కూడా నీ కలలు సాకారం చేసుకోగలగాలి అంటూ ఆ నెటిజన్ కు క్లాస్ తీసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.