Movies

రానాతో సాయి పల్లవి ఎలాంటి పాత్ర చేస్తోందో తెలుసా… సాహసం చేస్తుందా…?

‘నీది నాది ఒకే కథ’ అనే సినిమాలో యూత్‌కు సంబందించి కొత్త అంశంతో హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వేణు ఊడుగుల’ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘విరాటపర్వం’. నిజానికి ఇది పౌరాణిక చిత్రం కానీ కాదు. సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రల్లో నక్సల్ బ్యాక్ గ్రౌండ్‌లో వస్తోన్న ఈ సినిమా పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోంది. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం గా తెస్తున్న ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కూడా ఇంట్రస్ట్‌గా ఉంటాయట. ఈ సినిమాలో రానా పాత్ర పాజిటివ్ ఆటీట్యూడ్‌తో పాటు కొంత నెగిటివ్ యాంగిల్ కూడా ఉండడమే ఓ కొత్తదనమట.

మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఓ న్యూ యాంగిల్‌లో విరాట పర్వం తీస్తున్నాడట దర్శకుడు. అప్పటి దళారుల వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేస్తారట. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయని పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా వీక్షకుల్నీ కట్టిపడేస్తుందని అంటున్నారు. ఆ మధ్య తమిళంలో సూర్య సరసన నటించిన ‘ఎన్‌జీకే’ చిత్రంలో సాయి పల్లవి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దెబ్బతింది. ఆ సినిమా కంటే ముందు ధనుష్‌తో జతకట్టి ఆడి పాడిన ‘మారి 2’ సినిమా మంచిగానే ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. అంతేకాదు ఆ సినిమాలో ‘రౌడీ బేబి’ పాట యూట్యూబ్‌ ప్రేక్షకులను విశేషంగా అలరించి రికార్డ్స్ సృష్టించింది.

తన నటన, డాన్స్‌తో అదరగొడుతున్న కూడా సాయిపల్లవికి తమిళంలో ప్రస్తుతానికి ఒక్క అవకాశం లేదు. అయితే తన టాలెంట్ తనకు శాపంగా మారిందా? అంతటి టాలెంట్ ఉన్న అమ్మాయితో నటించలేకే ఆమెను వద్దనడం వలన అవకాశాలు తగ్గాయా? అని ఆమె ఫాన్స్ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే, నటనలో గాని, లేదా డ్యాన్స్‌లో గాని ఏ హీరోకు తగ్గని టాలెంట్ ఆమె సొంతం. కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటిస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు తప్ప.. సాయి పల్లవి చేతిలో ఏ సినిమాలు లేవట. తనకున్న పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ కూడా అవకాశాలు రాకపోవాడానికి మరో కారణమై ఉండోచ్చు.