Movies

ఒక్క సినిమాలో అయినా నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్న 9 మంది హీరోలు

సినిమా స్టార్ అవ్వడం నిజంగా ఓ అదృష్టం. ఇక యాక్టర్ గా ఛాన్స్ వచ్చినప్పటికీ ఆతర్వాత ఛాన్స్ లు రాకపోతే విలువ ఉండదు.పలానా నటుడిని పెట్టుకోవాలంటే అతడి గురించి రైటర్స్ రాయాలి. పాత్రలు సృష్టించాలి. లేకపోతె ఎడ్రెస్ గల్లంతే. అంతెందుకు కేరాఫ్ కంచరపాలెం సినిమాలో హీరోగా గెడ్డంతో చేసిన మోహన్ భరత్ కి మహర్షితో చిన్న ఛాన్స్ తప్ప మళ్ళీ ఎలాంటి అవకాశం రాలేదు. కోరుకున్న ప్రియుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ,పెళ్లి మూవీతో మంచి హిట్ అందుకున్న వడ్డే నవీన్ కెరీర్ 2000సంవత్సరం వరకూ బాగానే నెట్టుకొచ్చాడు. ఇక కొత్త హీరోలు రావడంతో ఇతడి సినిమాలు చతికిలబడ్డాయి. దీంతో అతడి కెరీర్ ముగిసింది .

హీరో నారా రోహిత్ ని తీసుకుంటే,బాణం,ప్రతినిధి,రౌడీ ఫెలో, సోలో, అసుర,జ్యో అచ్యుతానంద లాంటి మూవీస్ లో హీరోగా విభిన్న క్యారెక్టర్స్ వేసాడు. 2016లో కమర్షియల్ మూవీస్ లోకి దిగి సక్సెస్ లు అందుకోలేదు.అయితే ఇతడి కెరీర్ కి శుభం కార్డు పడలేదు అందుకే ఇతడి కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో హిట్ మూవీస్ తో దూసుకెళ్లిన లవర్ బాయ్ తరుణ్ 2000నుంచి మంచి రేంజ్ లో ఉన్నాడు. అయితే ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేక ఇండస్ట్రీ నుంచి సైడ్ అయ్యాడు. చాలామంది ఇతడిని హీరోగా చూడాలని ఉవ్విళూరుతున్నారు. ఒకప్పుడు జీన్స్ లాంటి సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన ప్రశాంత్ కి కెరీర్ ఆగిపోయింది. ఈమధ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.

ఈవీవీ కుమారుడు ఆర్యన్ రాజేష్ హాయ్,సొంతం, ఎవడి గోల వాడిదే వంటి ఎన్నో హిట్స్ కొట్టినప్పటికీ ఇతగాడికి కెరీర్ ముందుకు వెళ్ళలేదు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎంట్రీ ఇచ్చినా లాభం లేకపోయింది. మాస్ హీరో లక్షణాలన్నీ ఫుల్లు గా ఉన్నా,మంచు మనోజ్ ఎందుకనో వెనుకబడి పోయాడు. అన్ని భాషల్లో మంచి సినిమాలు చేసిన సిద్ధార్ధ్ కెరీర్ దెబ్బతింది. మంచి స్క్రిప్ట్ తో సినిమా తీస్తే చూడ్డానికి జనం ఎదురుచూస్తున్నారు. స్వయంవరం , చిరునవ్వు ఇలా మంచి హిట్ సినిమాలతో హిట్ అందుకున్న వేణు తొట్టెంపూడి హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే వంటి సినిమాలతో ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాడు. అయితే ఆతర్వాత నుంచి మంచి స్టోరీలు రాకపోవడంతో పక్కకు వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఇతడికి ఆడియన్స్ లో డిమాండ్ ఉన్నా ఎవరూ పెట్టుకోవడం లేదు.