Movies

నిఖిల్ కార్తికేయ సీక్వెల్ కి అంత బడ్జెట్‌ అవసరమా…షాక్ అయ్యే బడ్జెట్‌

హ్యాపీ డేస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో బిగ్గె్స్ట్ హిట్‌గా కార్తికేయ మూవీ నిల్చింది. ఇక ఈమధ్య ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్న నిఖిల్ తాజాగా కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.చందూ ముండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సస్సెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. గతంలో వచ్చిన కార్తికేయ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిల్చి,మంచి కలెక్షన్స్ సాధించింది.

చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చిన కార్తికేయ ఎలాంటి సక్సెస్ సాధించిందో గుర్తుచేసుకుంటూ,ఈ సినిమా సీక్వెల్‌ను ఎక్కడా రాజీ పడకుండా చిత్రీకరించేందుకు నిఖిల్ అండ్ టీమ్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు చిత్ర యూనిట్ రూ.13 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందట.ఈ బడ్జెట్‌లో చిత్ర నిర్మాణ పనులను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీగానే ఉంటాయని టాక్.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇక ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమా బడ్జెట్‌ విషయంలో ఎలాంటి మార్పులు జరగకుండా చిత్ర యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమా ఉండేలా తీర్చిదిద్దాలన్నది యోచన అంటున్నారు.