Movies

కృష్ణ వంశీ రమ్య కృష్ణలా కొడుకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏమి చేస్తున్నాడో తెలిస్తే ఖచ్చితంగా షాక్

గ్లామర్ హీరోయిన్ గానే కాదు,సెంటిమెంట్,లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో కూడా తన సత్తా చాటిన రమ్య కృష్ణ ఇప్పుడు అదే రేంజ్ లో సపోర్టింగ్ ఆర్టిస్టుగా కూడా తన దూకుడు సాగిస్తోంది. సూత్రధారులు,అల్లరిప్రియుడు,అల్లుడు గారు,మేజర్ చంద్రకాంత్ ఇలా ఎన్నో సినిమాల్లో తనకంటూ ఓ విలక్షణత, గ్లామర్ సొంతం చేసుకున్న రమ్యకృష్ణ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

నిజానికి కెరీర్ మొదట్లో రమ్య కృష్ణ సినిమాలు హిట్ కాకపోవడంతో చాలా ఇబ్బంది ఎదుర్కొంది. ఐరెన్ లెగ్ అనేంతగా ముద్ర వేయించుకున్న ఈమె తనపై ఉన్న అపోహ పోగొట్టుకుని, తీస్తే ఈమెతోనే సినిమా తీయాలని అనిపించుకునే స్థాయికి ఎదిగింది. తెలుగులో అగ్రహీరోల అందరి సరసన నటించిన ఈమె తమిళం,కన్నడ తదితర భాషల్లో కూడా ఎందరో హీరోలతో జోడీ కట్టింది. హీరోయిన్ గా ఒక రేంజ్ లో ఉన్నప్పుడే స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీని పెళ్లిచేసుకుంది.

నిజానికి అప్పట్లో రమ్య ఏ హీరోని పెళ్లి చేసుకుంటుందా అని అందరూ ఎదురు చూస్తుంటే కృష్ణ వంశీని పెళ్ళాడడంతో సంచలనం అయింది. ఇక వీరిద్దరికి రుత్విక్ అనే కొడుకు ఉన్నాడు. పెళ్లయ్యాక కొంత విరామం ఇచ్చి సపోర్టింగ్ ఆర్టిస్టుగా కూడా తన సత్తా చాటుతోంది. బాహుబలి మూవీలో ఆమె నటన అద్భుతం. శివగామి పాత్ర ఆమె రేంజ్ ని అమాంతం ఎక్కడికో తీసుకెళ్లింది. మోడ్రన్ మదర్ గా నటిస్తూ తానేమిటో చూపిస్తోంది. అయితే కొడుకుని దూరంగా పెట్టి పెంచుతున్నారు. త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇప్పిస్తారని టాక్. అయితే అప్పుడే దీని గురించి చెప్పలేమని రమ్యకృష్ణ అంటోంది.