Movies

అనసూయ ఒక్క ఈవెంట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా?

తెలుగులో పలురకాల షోలు, ఈవెంట్లతో నిత్యం బిజీబిజీగా ఉండే యాంకర్లలలో టాలీవుడ్ గ్లామరస్ యాంకర్ అనసూయ ఒకరు.ఈ అమ్మడు తెలుగులోని దాదాపుగా అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో షోలు నిర్వహిస్తూ వ్యాఖ్యాతగా తన హవా కొనసాగిస్తోంది.

అంతే కాక మరో పక్క సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్, మరియు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు చేస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.అయితే తాజాగా యాంకర్ అనసూయ ఈవెంట్ కి తీసుకునే రెమ్యునరేషన్ విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే వచ్చే వారం ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కామెడీ షో ప్రోమో ని షో నిర్వాహకులు విడుదల చేశారు.ఇందులో భాగంగా హైపర్ ఆది స్కిట్ లో అనసూయ గురించి పంచులు పెలుస్తాడు.

ఈ క్రమంలో యాంకర్ అనసూయ ఒక ఈవెంట్ కి మూడు లక్షల రూపాయల తీసుకుంటున్నట్లు చెబుతాడు.ఈ విషయం ప్రస్తుతం నెట్టింట్లో ట్రోల్ అవుతుంది.అయితే ఏదో సరదాగా ఈ విషయం చెప్పినప్పటికీ యాంకర్ అనసూయ ఉన్నటువంటి పాపులారిటీ కి ఇంతకంటే ఎక్కు వే ఇవ్వచ్చని అనసూయ అభిమానులుఅంటున్నారు.

అయితే ప్రస్తుతం అనసూయ వరుస టాలీవుడ్ మెగా హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.ఇందులో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న టువంటి చిత్రంలో ఓ కీలక సన్నివేశం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.అలాగే అనసూయ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చిత్రంలో కూడా నటిస్తోంది.