Movies

సమంతా పెళ్ళికి ముందు…పెళ్ళికి తర్వాత ఎంత ఆస్థి సంపాదించిందో తెలుసా?

అక్కినేని వారి కోడలు అయ్యాక కూడా సినిమాల్లో మరింత బిజీ అయిపోయి,రెమ్యునరేషన్ కూడా ఎక్కువే అందుకుంటున్న ముద్దుగుమ్మ సమంత తాజాగా శర్వానంద్ తో కల్సి నటించిన జాను మూవీ మంచి టాక్ తెచ్చుకోవడం జోష్ మీద ఉంది. గోల్డెన్ లెగ్ తో ఎంట్రీ ఇచ్చి,అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లిచేసుకున్న సమంత తెలుగు,తమిళ భాషల్లో దూసుకెళ్తోంది.

ఏం మాయ చేసావే మూవీతో ఎంట్రీ ఇచ్చి ఇప్పటి దాకా 35కి పైగా తెలుగు సినిమాల్లో చేసిన సమంత ఎనిమిదేళ్ల పాటు టాలీవుడ్ లో క్వీన్ గా ఏలింది. ఆమె పట్టుదల,ఆమె ఫాన్స్ ఆమెకు అసలైన ఆస్తిగా చెబుతుంది. అందుకే ఆమె టాప్ పొజిషన్ లో దూసుకెళ్తూనే ఉంది.

అయితే ఇంతగా రాణిస్తున్న సమంత ఆస్థి ఎంత,ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుంది ,ఏడాది ఆదాయం ఎంత వంటి అంశాల్లోకి వెళ్తే, ఈమె ఆదాయం 35నుంచి 40కోట్లు. ఒక్కో సినిమాకు మూడు కోట్లు తీసుకుంటుంది. యాడ్స్,సినిమాలు అన్నీ కలిపి ఏడాదికి 7నుంచి 10కోట్లు సంపాదిస్తుంది. హైదరాబాద్ లో రెండు కోట్లు విలువ చేసే ఇల్లు,ఒక సూపర్ లగ్జరీ కారు మెయింటేన్ చేస్తోంది.