Movies

సరిలేరు నీకెవ్వరు 32 రోజుల కలెక్షన్లు.. ఎంతంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో తొలి సినిమాగా రిలీజ్ అయ్యింది.దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ మాస్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్‌ను సాధించింది.

ఇక పండగ సెలవులు కూడా కలిసి రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు.అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాస్, క్లాస్ వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొట్టింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి 32 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.137.64 కోట్ల వసూళ్లు సాధించింది.ఈ సినిమాతో మహేష్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు.

రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 32 రోజులకుగాను కలెక్ట్ చేసిన మొత్తం ఏరియాలవారీగా ఈ విధంగా ఉంది.

నైజాం – 39.55 కోట్లు
సీడెడ్ – 15.55 కోట్లు
గుంటూరు – 9.90 కోట్లు
ఉత్తరాంధ్ర – 19.77 కోట్లు
ఈస్ట్ – 11.30 కోట్లు
వెస్ట్ – 7.42 కోట్లు
కృష్ణా – 8.85 కోట్లు
నెల్లూరు – 4.03 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 116.37 కోట్లు
కర్ణాటక – 7.51 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.81 కోట్లు
ఓవర్సీస్ – 11.95 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు – 137.64 కోట్లు