Movies

టాలీవుడ్ ని వదిలేసి ప్రపంచంలోనే గొప్ప కంపెనీలలో కీలక బాధ్యతల్లో హీరోయిన్స్

హీరోల కంటే హీరోయిన్స్ కి సినిమాల్లో లైఫ్ తక్కువ. పదేళ్లు గడిచిందంటే,అక్కా అమ్మా పాత్రలలో నెట్టుకు రావాల్సిందే. లేదంటే ఇండస్ట్రీకి దూరంగా జరగాల్సిందే. అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం పెళ్లయ్యాక సంసారం చక్కదిద్దుకుని వేరే రంగాల్లో రాణిస్తూ తమ గుర్తింపును కాపాడు కుంటున్నారు. తెరమీద బొమ్మలమే కాదు,తలచుకుంటే ఏదైనా సాధించగలమని చాటుతున్నారు. మహేష్ బాబు నటించిన వంశీ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసిన మయూరి బాలీవుడ్ లో చాలా సినిమాల్లో చేసింది. ఐ ఐ ఐ టి లో చేరి,మధ్యలో మానేసిన ఈ అమ్మడు పలు సినిమాల్లో తర్వాత బుల్లితెరపై కూడా నటించింది. ఇక ఛాన్స్ లు తగ్గడంతో అమెరికాలో ఎం బి ఏ ఫైనాన్స్ పూర్తిచేసింది. గురు గావ్ లో గూగుల్ ఇండియాలో టాప్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు నిర్వహిస్తోంది.

ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సుందరాకాండ మూవీలో అల్లరిపిల్లగా నటించిన అపర్ణ ఆతర్వాత ఏ మూవీలోనూ కనిపించలేదు. ఇండియాలో చైల్డ్ సైకాలజీ పూర్తిచేసి, 2002లో శ్రీకాంత్ అనే ఎన్ ఆర్ ఐ ని పెళ్ళాడి, అమెరికాలో సెటిల్ అయింది. పెళ్ళయాక డబుల్ మాస్టర్స్ పూర్తిచేసి,అక్కడ ఒక పెద్ద విద్యా సంస్థలో ఏడేళ్లుగా సైకాలజిస్ట్ గా పనిచేస్తూ ఎందరినో తీర్చిదిద్దుతోంది. జయం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన శ్వేతా యామిని సైతం హీరోయిన్ గా వచ్చిన ఛాన్స్ లు వదిలేసింది. చదువుల్లో నెంబర్ వన్ గా ఉంటూ క్యాంపస్ ఇంటర్యూలో మొదట విప్రోలో జాబ్ చేసింది. అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేసి ,వరల్డ్ నెంబర్ వన్ కంపెనీలో ఉద్యోగం చేసింది. అయితే పెళ్లయ్యాక ఫ్యామిలీ బిజినెస్ ని చూసుకుంటూ తన టాలెంట్ చూపిస్తోంది.

సీతారామరాజు సినిమాలో హరికృష్ణ,నాగార్జున చెల్లి గా ఎంట్రీ ఇచ్చిమ మాన్య నాయుడు ఆతర్వాత శివాజీ తో కల్సి చేసిన సినిమాలో మాయదారి మైసమ్మ పాటలో దుమ్మురేపింది. ఈ రెండు మూవీస్ తర్వాత తెలుగు,తమిళం,మలయాళం,కన్నడ భాషల్లో కూడా తన సత్తా చాటింది. 41సినిమాల్లో నటించిన ఈ అమ్మడు పెళ్లయ్యాక న్యూయార్క్ లో స్థిరపడింది. నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. అయితే ఈమె బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగంలో చేరి,జెపి మోర్గాన్ చాస్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది.