ఒకప్పుడు టాప్ హీరోయిన్స్ …. కానీ నేడు సన్యాసులు
పెళ్లి సాకుతోనే,ప్రేమ సాకుతోనో జీవితంలో తిన్న ఎదురుదెబ్బల కారణంగా కొందరు హీరోయిన్స్ తమకు మానసిక ప్రశాంతత నిచ్చే ఆధ్యాత్మిక రంగంవైపు అడుగులు వేశారు. అలాంటి వారిలో పలు భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. కొందరైతే సన్యాసం కూడా స్వీకరించారు. మనిషా కొయిరాలా,సుచిత్రా సేన్,మమతా కులకర్ణి,భర్గా మదన్ వంటి హీరోయిన్స్ సన్యాసం పుచ్చకున్నారు. ఇక కామెడీ స్టార్ రమాప్రభ గురించి ముందుగా ప్రస్తావించాలి. ఈమె పెళ్లి ,ఆతర్వాత విడాకుల తర్వాత జీవితాన్ని ఆధ్యాత్మిక రంగంవైపు మళ్లించింది. టాలీవుడ్ పెద్దల విరాళాలతో నెట్టుకొస్తున్న ఈమె లేచింది మొదలు,నిద్ర పోయేదాకా దైవ చింతనలోనే గడుపుతోంది.
ఇక గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఆడియన్స్ హృదయాలను దోచుకున్న గిరిజ ఆతర్వాత హృదయాంజలి మూవీలో చేసి ఇక అక్కడ నుంచి కన్పించలేదు. బ్రిటన్ లో పుట్టి పెరిగిన గిరిజ భరతనాట్యం నేర్చుకోడానికి ఇండియా వచ్చి అనుకోకుండా హీరోయిన్ అయింది. అయితే రెండు సినిమాల తర్వాత మనసు మార్చుకుని స్పిరిట్యువల్ వైపు అడుగులు వేసింది. పాండిచ్చేరి లోని శ్రీ అరబిందో ఆశ్రమంలో చేరిన ఈమె ఆధ్యాత్మిక రంగంలోనే ఉంది. అలాగే చెన్నైకి చెందిన హీరా రాజగోపాల్ అలియాస్ హీరా ఓ స్టార్ హీరో ప్రేమలో మోసపోయి ఇండస్ట్రీని వదిలేసి ఆధ్యాత్మికం వైపు మళ్లింది.
హీరా తెలుగులో ఆహ్వానం,అల్లుడుగారు వచ్చారు, లిటిల్ సోల్జియర్స్ వంటి మూవీస్ లో చేసింది. తమిళం,మళయాళ ,హిందీ మూవీస్ లో కూడా చేసిన ఈమె దాదాపు 50కి పైనే సినిమాలు చేసింది. నిజానికి ఎవరినో పెళ్లి కూడా చేసుకున్నాక, పట్టుమని నాలుగేళ్లు సజావుగా సాగకపోవడంతో జీవితంపై విరక్తితో ఆద్యాత్మికతను జీవన మార్గంగా ఎంచుకుంది. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి కర్బందా బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. మొన్న ఆమధ్య సినిమా కోసం లండన్ వెళ్ళినపుడు అక్కడ గురుద్వారాకు వెళ్లి అక్కడ శుభ్రం చేసింది. షూటింగ్ కి బ్రేక్ రావడంతో అందరూ లండన్ పరిసర ప్రాంతాలను చుట్టిరావడానికి వెళ్తే ఈమె మాత్రం ఇలా గడిపింది.