మోక్షజ్ఞ కోసం కథ రెడీ అయ్యిందట, ట్విస్ట్ ఏంటంటే!
నందమూరి హీరో బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయబోతున్నాడు.ఈ వార్త రెండు సంవత్సరాలుగా వస్తూనే ఉంది కదా అంటారా.అయితే ఇక్కడ చిన్న అప్‌డేట్ ఏంటీ అంటే ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికా వెళ్లి అక్కడ బరువు తగ్గడంతో పాటు నటన మరియు డాన్స్‌ల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.ఇదే సమయంలో మోక్షజ్ఞ కోసం కథను సిద్దం చేస్తున్నారు.బాలకృష్ణకు అత్యంత ఆప్తుడు అయిన ఒక రచయిత కథను సిద్దం చేశాడు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటీ అంటే మోక్షజ్ఞ మొదటి సినిమాకు బాలయ్య దర్శకత్వం వహించబోతున్నాడట.ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అయ్యింది.ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత కొడుకు సినిమాను మొదలు పెడతాడు అంటూ ప్రచారం జరుగుతుంది.బాలయ్య గతంలో దర్శకత్వం చేయాలనుకున్న సినిమా సౌందర్య చనిపోవడంతో ఆగిపోయింది.మళ్లీ ఇన్నాళ్లకు దర్శకత్వం వహించబోతున్నాడు.
బాలయ్య దర్శకత్వంలో అంటే మోక్షజ్ఞ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.గతంలో ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలయ్య నటించాడు.తన తండ్రి దర్శకత్వంలో తాను నటించినట్లుగా ఇప్పుడు తన దర్శకత్వంలో తన కొడుకును చేయించాలని బాలయ్య ఆలోచనగా తెలుస్తోంది.ఇది కాస్త విడ్డూరంగా ఉన్నా నిజమే అంటూ నందమూరి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.వచ్చే ఏడాదిలో ఈ చిత్రం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.